బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్‌… వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే..!

ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం ర‌స‌కందాయంగా న‌డుస్తుంటే అంత‌లోనే కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు కూడా వ‌చ్చాయి. ఈ రెండు ఎన్నిక‌ల‌పైనే ఇప్పుడు చ‌ర్చంతా జ‌రుగుతుండ‌గా ఇప్పుడు మ‌రో హాట్ హాట్ పొలిటిక‌ల్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. నిన్న‌టి వ‌ర‌కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు.

ఇక నంద్యాల ఉప ఎన్నిక నేప‌థ్యంలో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు క‌ప్ప‌దాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి త‌న ప‌ద‌వికి గుడ్ బై చెప్పి మ‌రీ వైసీపీలోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండ‌గానే ఇప్పుడు అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా వైసీపీలోకి వెళ్లిపోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబును మంత్రి వ‌ర్గం ప్ర‌క్షాళ‌న‌లో త‌ప్పించిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే సీటు కూడా రాద‌న్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. దీంతో ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు టాక్‌.

ఈ మేర‌కు ఆయ‌న ఒంగోలు ఎంపీ వైవి.సుబ్బారెడ్డితో పాటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ర‌హ‌స్య చ‌ర్చ‌లు కూడా జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది.  ఏదేమైనా రావెల పార్టీ మారితే చంద్ర‌బాబుకు మైండ్ బ్లాక్ అయ్యే షాక్ లాంటిదే.

Also Read:  http://www.telugustarnews.com/telugu/central-gave-shock-news-to-chandrababu/

బాబుకి కేంద్రం పెద్ద షాక్…

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *