“బాబు , రాహుల్” డీల్ 500 కోట్లు..బయపెట్టిన…“కేటీఆర్”

తెలంగాణా ఎన్నికల పోరు రోజు రోజు కి ఉదృతం అవుతోంది ఎన్నికలు ఇంతా ఎంతో దూరం లేకపోవడంతో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేటిఆర్ మహాకూటమిలోని టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని టార్గెట్ గా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా చంద్రబాబు రాహుల్ గాంధీ ల మధ్య 500 కోట్ల భారీ డీల్ జరిగిందని బాంబు పేల్చారు..రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపిలకు మనుగడ లేదన్నారు.చిల్లరమల్లర రాజకీ యాల కోసం పోలీసులను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని కేటిఆర్‌ ఫైర్ అయ్యారు.

Image result for ktr chandrababu

చంద్రబాబు  కనీసం తన నీడని కూడా నమ్మని మనిషని అలాంటిది కాంగ్రెస్ పై ఎలా నమ్మకం ఉంటుందని అందుకే  ఏపి నుంచి ఇంటిలిజెన్‌స వర్గాలని  తెలంగాణకు పంపారని అన్నారు కేటిఆర్. మొన్న సర్వే చేసిన ఏపి పోలీసులు ఎవరెవరు అనే వివరాలు అన్నీ తమ వద్ద ఉన్నాయని కేటిఆర్ తెలిపారు.రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడి వాహనాన్ని తనిఖీ చేయాల్సిందేనని కేటిఆర్‌, అవసరం అయితే తమ వాహనాన్ని కూడా తనిఖీ చేయండి అన్నారు.

Image result for chandrababu rahul

అయితే ఈ ఎన్నికలు ఢిల్లీ బలుపుకి తెలంగాణా ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు కేటిఆర్ సీల్డు కవరు సిఎం కావాలా, సింహం లాంటి సిఎం కేసిఆర్‌ గెలిపించుకుందామా? ఆలోచించుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు..ఏది ఏమైనా ఇప్పుడు రాహుల్ కి బాబు కి మధ్య ఈ 500 కోట్ల డీల్ విషయం హాట్ టాపిక్ అవుతోంది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *