సావిత్రి కెరీర్ ను కుప్పకూల్చిన ఏకైక సినిమా ఇదే…

మహానటి సావిత్రి తన సినీ కెరియర్ లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏ హీరోయిన్ చేరుకొని స్థాయికి  వెళ్ళారు. సహజనటిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు. ఆర్దికంగా  కూడా కొందరు హీరోల కంటే ముందు వరుసలో ఉన్న ఆమె కెరియర్ ఆమె చేసిన చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒక్క సారిగా కుప్ప కూలిపోయింది. సావిత్రి ని ఆర్ధికంగా దెబ్బ తీసిన కారణాలు ఎన్నో ఉన్నా ఒక్కే ఒక్క సినిమా మాత్రం బలమైన దెబ్బ తీసిందనే చెప్పాలి.

Chinnari Papalu (Savithri Ganesan) – Info View – Indiancine.ma

సావిత్రికి జెమినీ గణేషన్ తో పెళ్లి జరగడం ఆమె కెరియర్ కు అతిపెద్ద మైనస్ అని అంటుంటారు సినీ ప్రముఖులు. తన భర్త గణేషన్ తో కలిసి తీసిన సినిమా ఒక్కటి కూడా ఆమెకు కలిసి రాలేదు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమాలకు సావిత్రి సంపాదించన డబ్బు నుంచీ ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసేవారట. దాంతో ఆర్ధికంగా కష్టాలు మొదలవుతున్న క్రమంలో గణేషన్ వేరే మహిళతో పరిచయం పెంచుకోవడం సావిత్రిని మానసికంగా కూడా దెబ్బ తీసింది. ముఖ్యంగా సావిత్రిని ఆర్ధికంగా పీకల్లోతు ముంచేసిన సినిమా “చిన్నారి పాపలు”..

Savitri-Gemini Ganesan love story: Botched affair to the bottle

సావిత్రి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారనే చెప్పాలి. ఆమె స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మించిన సినిమా ఇది. అగ్ర నటీమణులు సైతం ఈ సినిమాలో నటించారు, వారిపై ఉన్న నమ్మకంతో సావిత్రి ముందుగానే  వారికి రెమ్యునిరేషన్  లు కూడా ఇచ్చేశారట. అయితే ఈ సినిమా మొదలు ఏ ఒక్కరు కూడా సావిత్రికి సహకరించక పోగా చెప్పకుండా షూటింగ్ లకు ఎగ్గొట్టేవారట. దాంతో అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోవడం, సావిత్రి స్వీయ దర్సకత్వంలో వచ్చిన మొట్టమొదటి సినిమా కావడంతో బయ్యర్లు వెనకడుగు వేశారట. ఈ సమయంలోనే సావిత్రికి ఇంటిపై ఐటీ దాడులు కూడా జరగడంతో ఆమెను ఆర్ధికంగా మరింత కుంగదీశాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *