టీడీపీకి ముగ్గురు ఎమ్మెల్సీలు గుడ్ బై..!

ఏపీలో అధికార టీడీపీ నుంచి విప‌క్ష వైసీపీలోకి వ‌ల‌స‌ల ప‌ర్వం ఇప్ప‌ట్లో ఆగేలా లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఏకంగా ఒకేసారి ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి షాక్ ఇచ్చి వైసీపీలో చేరిపోతార‌న్న వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు అవుట్ అయ్యారు. కేసుల్లో ఇరుక్కున్న ఎమ్మెల్సీలు దీప‌క్‌రెడ్డి, వాకాటి నారాయ‌ణ‌రెడ్డిని బాబు పార్టీ నుంచి స‌స్పెండ్ చేశారు.

ఇక క‌ర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో పాటు త‌న ప‌ద‌వికి కూడా రాజీనామా చేసేశారు. ఇక ఇప్పుడు ఏకంగా ముగ్గురు ఎమ్మెల్స‌లు పార్టీ నుంచి వైసీపీలోకి జంప్ చేస్తార‌ని తెలుస్తోంది. అద్దంకి, జ‌మ్మ‌ల‌మ‌డుగులో గ్రూపు రాజ‌కీయాల నేప‌థ్యంలో క‌ర‌ణం బ‌ల‌రాం, రామ‌సుబ్బారెడ్డితో పాటు పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతోన్న ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్లిపోతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్లు రావ‌డి డిసైడ్ అవ్వ‌డంతో అద్దంకిలో క‌ర‌ణం బ‌ల‌రాం, జ‌మ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి పార్టీ మారేందుకు వెయిట్ చేస్తున్నాడు. ఇక వీరికి తోడుగా ప్రకాశం జిల్లాలో కీలక నాయకుడు మాజీ ఎంపీ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైకాపా తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా పుకార్లు వస్తున్నాయి. వీరు ముగ్గురు పార్టీ మారితే టీడీపీకి దిమ్మ‌తిరిగి పోవ‌డం ఖాయం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *