టాలీవుడ్ లో మరో విషాదం..జయప్రకాష్ రెడ్డి మృతి…!!!

తెలుగు ఇండస్ట్రీ మరొక ప్రముఖ నటుడు కోల్పోయింది. టాలీవుడ్ లో  పలు చిత్రాలలో విలన్ గా నటించి మెప్పించిన జయప్రకాష్ రెడ్డి గత రాత్రి  గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ లోని  సిరివెళ్ల గ్రామంలో 1946లో ఆయన జన్మించారు.  బ్రహ్మపుత్రుడు సినిమా ద్వారా టాలీవుడ్ వుడ్ పరిశ్రమలోకి  అడుగుపెట్టిన జయప్రకాష్ రెడ్డి రాయలసీమ యాసలో మాట్లాడుతూ  నటించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పాలి.

Jayaprakash Reddy movies, filmography, biography and songs - Cinestaan.com

సమరసింహా రెడ్డి , ప్రేమించుకుందాం రా ,నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి  చిత్రాలలో విలన్ గా నటించిన ఆయన తెలుగు ప్రేక్షకుల నిరాజనాలు అందుకున్నారు. కరడుగట్టిన విలన్ గా,  కామెడీ విలన్ గా, అలాగే కమెడియన్ గా తనదైన నటనతో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్న జయప్రకాష్ రెడ్డి మరణించడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆయన మృతి పట్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని పలువురు నటులు దిగ్భ్రాంతికి లోనయ్యారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *