టాలీవుడ్ బాక్సాఫీస్ రచ్చ రచ్చే…జనవరిలో విడుదలయ్యే స్టార్ హీరోల సినిమాలు ఇవే…!!!

సంక్రాంతికి టాలీవుడ్ లో సినిమాల జాతర ప్రతీ ఏటా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బాలయ్య సినిమా సంక్రాంతి బరిలో ఉండి తీరాల్సిందే, బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ కూడా ఉందిలెండి. ఇక ఈ ఏడాది బాలయ్య బాబు సినిమాతో పాటు సూపర్ స్టార్స్, మెగా స్టార్స్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఈ జనవరి నెలలో సంక్రాంతి బరిలో నిలవనున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం

It's official! Nandamuri Balakrishna's Veera Simha Reddy to release in  theatres on Jan 12 - India Today

బాలయ్య బాబు హీరోగా దర్శకుడు మలినేని గోపీ చంద్ దర్శకత్వంలో నందమూరి అభిమానులను అలరించడానికి, సంక్రాంతి బరిలో ఉన్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాను జనవరి 12 న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టింది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక.

Veerayya title song from Waltair Veerayya is out now - Film Crazy Media

మెగా స్టార్ హీరోగా దర్శకుడు బాబి దర్శకత్వంలో రవితేజ ప్రత్యెక పాత్రలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13న విడుదలకు సిద్దమయ్యింది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి నందమూరి, మెగా స్టార్ సినిమాల రిలీజ్ అంటే ఇరు ఫ్యాన్స్ కు విపరీతమైన పోటీ ఉంటుంది దాంతో రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలాఉంటే

Thunivu (2022) - Movie | Reviews, Cast & Release Date in - BookMyShow

తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా వస్తున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న సినిమా తునివు. నిర్మాత బోని కపూర్, జీ స్టూడియో సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా కూడా జనవరి 12 న విడుదల కానుంది. అలాగే

Varisu: Date for Thalapathy Vijay starrer audio launch announced; Find Out  | PINKVILLA

మరో తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా “వరిసు” తెలుగులో ఈ సినిమాని వారసుడి గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా కూడా జనవరి 12 న విడుదల కానుంది.

Pathan Official Trailer | Shah Rukh Khan, Deepika P ,Siddharth Anand  #YRFnewreleases Concept Trailer - YouTube

ఇక బాలివుడ్ నుంచీ పటాన్ జనవరి 25 న విడుదల కానుంది. షారుక్, దీపిక జంటగా విడుదల అవనున్న ఈ సినిమా ఇప్పటికే వివాదాల చుట్టూ తిరగడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. సో మొత్తానికి జనవరి నెలలలో భారీ సినిమాలు ప్రేక్షకులను అలరించనుండగా, బాలయ్య బాబు ,మెగాస్టార్ ల సినిమాల కోసం మాత్రం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *