నంద్యాల‌లో జ‌గ‌న్ వ్యూహం…. బాబుకు వ‌ణుకే వ‌ణుకు

ఏపీలో నంద్యాలనంద్యాల్లో ఫిరాయింపు దారులైన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువగా ఉంది. వైసీపీ నుంచి గెలిచిన మంత్రులు అయిన   అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డి. ఆదినారాయణ రెడ్డితో సహా ప‌లువురు జంపింగ్ ఎమ్మెల్యేలు ఇక్క‌డ వైసీపీని, జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామా చేసి వైసీపీ నుంచి గెలిచిన వాళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన చంద్ర‌బాబు కూడా వాళ్ల‌తో త‌మ ప‌ద‌వులకు రాజీనామాలు చేయించాల‌ని స‌వాల్ విసిరారు.

ఉప ఎన్నిక వేళ వైసీపీ అధినేత జ‌గ‌న్ వేస్తోన్న ఎత్తులు, పై ఎత్తుల‌తో అధికార టీడీపీకి, సీఎం చంద్ర‌బాబుకు చెమ‌ట‌ల మీద చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. ఇక్క‌డ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన శిల్పా చక్రపాణి రెడ్డి చేత రాజీనామా చేయించి బాబును ఇర‌కాటంలో పెట్టిన జ‌గ‌న్ ఇప్పుడు మ‌రోసారి ఇర‌కాటంలో ప‌డేయ‌నున్నాడు. జ‌గ‌న్ వ‌రుస‌గా ప‌న్నుతోన్న వ్యూహాల్లో చిక్కుకున్న చంద్ర‌బాబు విల‌విల్లాడుతున్నాడు.

 

శిల్పా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పుకోలేని టీడీపీ వాళ్లు నంద్యాల మునిసిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సెల‌ర్లు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లార‌ని వారు కూడా త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తారా ? అని ప్ర‌శ్నించారు. ఈ స‌వాల్‌కు స్పందించిన జ‌గ‌న్ ఇప్పుడు నంద్యాల మునిసిప‌ల్ చైర్మ‌న్‌తో పాటు కౌన్సెల‌ర్ల చేత కూడా రాజీనామా చేయిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

సంబంధిత చిత్రం

శిల్పా మోహన్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్లు వైకాపాలో చేరారు. వారందరి చేతా రాజీనామా చేయించి.. నైతికంగా చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని వైకాపా భావిస్తోందని సమాచారం. మ‌రి అదే జ‌రిగితే చంద్ర‌బాబు, టీడీపీ వాళ్లు త‌మ మొఖాలు ఎక్క‌డ పెట్టుకుంటారో ?

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *