చైనా కాళ్ళకిందే అమెరికా..సంచలన వ్యాఖ్యలు చేసిన ట్రంప్…!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో అధ్యక్ష అభ్యర్ధుల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకి పెరిగిపోతోంది. గెలుపు పై ఎవరి ధీమా వారికి ఉన్నా విజయం ఎవరి వరిస్తుందనేది మాత్రం కాస్త సస్పెన్స్ గానే మారింది. ట్రంప్ అనుకున్న సమయానికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ట్రంప్ కి విజయానికి అడ్డేలేదని విశ్లేషకులు అంటున్నారు. అందుకే  ట్రంప్ వ్యాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉంటే

Donald Trump: Republicans Condemn His Lewd Comments About Women | Fortune

ట్రంప్ తన బలమైన ప్రత్యర్ధిని ఎదుర్కునే క్రమంలో బిడెన్ గెలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, బిడెన్ చేయబోయే కుట్రలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిడెన్ గెలిస్తే ఇక అమెరికా యావత్తు చైనా వశం అవుతుందని అన్నారు. ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అమెరికా ఉద్యోగాలను చైనాకి ఎగుమతి చేసి తన కొడుకుకి లాభం చేకూర్చారని బిడెన్ పై విమర్శలు ఎక్కుపెట్టారు.

US elections: Who is Democratic presidential candidate Joe Biden? | US &  Canada | Al Jazeera

ఇక ఏకంగా అధ్యక్షుడే అయితే చైనా కళ్ళ కింద మనం బతకాల్సి వస్తుందని అన్నారు. అయితే అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తాను జాగ్రత్త పడుతానని, అలాంటి కుట్రల్ని నేను ఎదుర్కుంటానని హామీ ఇచ్చారు.బిడెన్ ఎన్ని ఎత్తులు వేసినా అమెరికా  ప్రజల మద్దతు తనకే ఉంటుందని అన్నారు, మరో సారి అమెరికా ప్రజలు తనని గెలిపిచడానికి సిద్దంగా ఉన్నారని ప్రకటించారు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *