అమెరికాలో ఓటింగ్ మొదలు..ఇప్పటికి పోలిన ఓట్లు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది. మరో సారి ట్రంప్ అధికారం చేపడుతారో లేదా బిడెన్ కి అమెరికా ప్రజలు ఈ సారి అధికారాన్ని కట్టబెడుటారోననే ఉత్కంటకు తెరపడే సమయం దగ్గరకు వచ్చేసింది.  ఎంతోమంది అమెరికన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

అదేంటి నవంబర్ 3 వ తేదీన పోలింగ్ కదా అనుకోవచ్చు. అవును పోలింగ్ జరిగేది నవంబర్ 3 వ తేదీనే కానీ  ఆ సమయంలో  ఓటు హక్కు వినియోగించుకోలేని వారికోసం ఎర్లీ ఓటింగ్ అనే విధానన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.

Early voting begins Tuesday; Local, state and federal seats on ballot

ఈ విధానం ద్వారా ఇప్పటికే ట్రంప్ ఓటు హక్కును వినియోగించుకాగా  దాదాపు 4 కోట్ల మంది అమెరికన్స్ ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. నవంబర్ 3 వ తేదీ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ఓటింగ్ సరళి ఎవరికీ అనుకూలంగా ఉందనేది మరి కొద్ది రోజులు అయితేనే కాని తెలియదని అంటున్నారు పరిశీలకులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *