valtheru veerayya ott netflix

OTT లోకి వాల్తేర్ వీరయ్య…కళ్ళు చెదిరే భారీ ఆఫర్….

మెగాస్టార్ చిరంజీవి, ఈపేరు వింటే చాలు  మెగా అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. చిరు రీ ఎంట్రీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎప్పుడైతే ఇచ్చారో అప్పటి నుండి  మెగా కాంపౌండ్ నుంచీ చిరు సినిమాలపై ఎలాంటి అప్డేట్ వస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు సినిమా రిలీజ్ అయినా రెండు రోజుల తరువాత కూడా మెగా స్టార్ కొత్త సినిమా ఏంటో అంటూ ఆరాలు తీస్తూనే ఉంటారు. తాజాగా చిరు నటించిన గాడ్ ఫాదర్ సినిమా బిగ్ సక్సస్ అయిన విషయం విదితమే. ఈ సినిమా తరువాత వచ్చే మూవీ ఎలా ఉండబోతోంది అనే వెయిటింగ్ తన ఫ్యాన్స్ కు ఎందుకు ఇవ్వాలి అనుకున్నారో ఏమో కానీ

గాడ్ ఫాదర్ తరువాత చిరు నటించబోయే 154 వ  చిత్రం  “వాల్తేర్ వీరయ్య” సినిమా టీజర్ ను దీపావళి సందర్భంగా మెగా అభిమానుల కోసం రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో మెగా స్టార్ మాస్ లుక్ చూసిన అభిమానులు ఉబ్బితబ్బిబ్బై పోయారు. మరో సారి మాస్ కా బాప్ వస్తున్నాడంటూ పండగ చేసుకున్నారు. ఈ సినిమాకు మెగాస్టార్ మాస్ గెటప్ ఒక ఆకర్షణ అయితే మాస్ మహారాజ్ రవితేజ ప్రత్యేక పాత్రలో నటించడం ఫ్యాన్స్ కు మరింత కిక్ ఇస్తోంది. ఇదిలాఉంటే

సంక్రాంతి బరిలో దిగబోతున్న వాల్తేర్ వీరయ్య డిజిటల్ రైట్స్ ను ప్రముఖ OTT దిగ్గజం NETFLIX భారీ మొత్తంలో డబ్బు ఇచ్చి సొంతం చేసుకుందట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు రూ. 50 కోట్ల పైనే ఈ డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. ఇదిలాఉంటే మరొక భారీ ఆఫర్ కూడా  NETFLIX ఇచ్చిందట అదేంటంటే…సినిమా విడుదలైన 3 వారాల కు OTT లో స్ట్రీమ్ చేసుకునే అవకాశం గనుకా ఇస్తే ఇంత కంటే భారీ మొత్తాన్ని ఇస్తామని నిర్మాతలకుఆఫర్ ఇచ్చిందట.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *