మరోసారి మామా,అల్లుడు…..ట్విస్ట్ లో నాన్న

నాగ చైతన్య ,వెంకటేష్ కి స్వయానా మేనల్లుడు.చైతు అంటే నాగార్జునకి చాలా ఇష్టం అందుకే ప్రేమం సినిమాలో చైతుకి మామ గా కనిపింఛి అభిమానులని అలరించారు.అయితే మళ్ళీ మరోసారి ఇద్దరూ కలిసి నటించబోతున్నారు అని టాలీవుడ్ టాక్.ఈ సారి మటుకు ఈ మామా అల్లుళ్ళు ఫుల్ లెంగ్త్ మూవీ లో కలిసి ఉండబోతున్నారు అని సినీ వర్గాలు చెప్తున్నాయి.

  venkatesh and nagachaitanya కోసం చిత్ర ఫలితం

  ఇంతకీ ఆ సినిమా ఎవరు దర్సకత్వం చేయబోతున్నారు అనేగా డౌట్.ఆ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్సకత్వం లో తెరకెక్కించబోతున్నారు.ఈ మామా అల్లుళ్ళు ఎప్పుడు సినిమా స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారట. కోన వెంకట్ ఈ సినిమా కి కధ,మాటలు అందిస్తున్నారు. ఇందులో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ లో నటించే అవకాశం ఉందని సమాచారం.

  ఇప్పటి వరకూ కుటుంబ కథా చిత్రాలకు దగ్గరగా ఉండే కథలనే ఎన్నుకుంటున్న కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాలో లో కూడా అన్ని రకాల ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అని చెప్తున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉంది కావున త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అని చెప్తున్నారు చిత్ర యూనిట్.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *