వాట్సప్ కొత్త ఫీచర్స్..ఏ స్థాయిలో ఉన్నాయంటే…!!!

ఉదయం లేచింది మొదలు పడుకునే వరకూ ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా లకి అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సప్ లాంటి మెసెంజర్ లపై యువత ఎక్కువగా దృష్టి పెడుతోంది. గ్రూప్ చాట్ లు, వాయిస్ మెసేజ్ లు, వీడియో కాల్స్ ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో రకాల ఫీచర్స్ తో వాట్సాప్ ఫుల్ ఫేమస్ అయ్యిపోయింది. ఈ క్రమంలోనే వాట్సాప్ సంస్థ తన యూజర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త హంగులతో యూజర్స్ ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజా వాట్సప్ మరో 11 ఫీచర్స్ ని యూజర్స్ కి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

 

ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 50 మందితో ఒకే సారి వీడియో చాట్, మెసెంజర్ రూమ్ సపోర్ట్, వేరు వేరు ఫోన్స్ లో ఒకే సారి మల్టీ చాట్ చేసుకునే విధంగా మల్టీ డివైజ్ సపోర్ట్ ని కూడా తీసుకురానుంది. కొత్త కాంటాక్ట్ నంబర్స్ ను సులభంగా క్యూఆర్ కోడ్ ద్వారా యాక్సెస్ చేసుకునే విధానన్ని కూడా తీసుకురానుంది. అదొక్కటే కాదు గ్రూప్ వీడియో చాటింగ్ లో మనకి కావాల్సిన వారి వీడియోని పెద్దగా చేసుకుని చూసే విధానం కూడా అందుబాటులోకి రానుంది. కేవలం ఒకే ఒక్క క్లిక్ తో గ్రూప్ వీడియో కాల్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్స్ వస్తే ఇక యూజర్స్ కి పండగే పండగా అంటున్నారు టెక్ నిపుణులు..

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *