పదవులు ఊడిపోతాయి…జగన్ ముందస్తు వార్నింగ్..!!!
వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయక ముందే దూకుడు ప్రదరిస్తున్నారు. తన హయాంలో ఎక్కడా కూడా ప్రభుతంపై కానీ, పార్టీపై కానీ చిన్న మచ్చ కూడా ఉండకూడదని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమే మనల్ని 151 సీట్లకి తీసుకెళ్లిందని. ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఏ ఒక్కరూ కూడా పని చేయకూడదని ముందస్తు వార్నింగ్ లు ఇచ్చేస్తున్నారు. అంతేకాదు..

ఎవరైనా సరే అవినీతి చేసినట్టు తెలిసితే పదవులు ఊడిపోతాయి అంటూ హెచ్చరికలు కూడా జారీ చేశారట. మన విజన్ 2024 చేరుకోవాలి. అందుకు తగ్గట్టుగా ప్రతీ ఒక్కరూ కష్టపడాలి. వైసీపీ ప్రభుత్వం గురించి ఏపీలో ప్రతీ ఒక్కరూ మంచిగా మాట్లాడుకోవాలి. ఈ ఆశయానికి ఎవరు తూట్లు పొడిచినా సహించాను, క్షమించాను అంటూ నేతలతో చెప్పినట్టుగా తెలుస్తోంది. జగన్ ఇచ్చిన ఈ ముందస్తు సూచనలు వైసీపీ నేతలు పాటించాల్సిందే లేదంటే అంతే సంగతులు..