బాబు ప్లాన్‌తో బాబునే బుక్ చేసిన వైసీపీ..

నంద్యాల ఉప ఎన్నిక‌ల‌కు అన్ని వైపుల నుంచి ప్ర‌చారం ఊపందుకుంటోంది. గెలుపే ల‌క్ష్యంగా అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు ముందుకు సాగుతున్నాయి. దీనిలో ఏ ఒక్క‌పార్టీనీ తీసేయ‌డానికి లేదు. ఎవ‌రికి అందివ‌చ్చిన విధంగా వారు దూసుకుపోతున్నారు. ఇక‌, టీడీపీతో పోల్చుకుంటే వైసీపీనే ఒక అడుగు ముందంజ‌లో ఉంద‌ని తెలుస్తోంది. ముఖ్యంగా గ‌తంలో చంద్ర‌బాబు విస్తృతంగా వాడుకున్న సోష‌ల్ మీడియాను ఇప్పుడు వైసీపీ క్ష‌ణం తీరిక లేకుండా వాడేస్తోంది. వైసీపీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌.. అయితే, సోష‌ల్ మీడియా యుద్ధాన్ని విడిచి పెట్టొద్ద‌ని సూచించార‌ట‌.
social media కోసం చిత్ర ఫలితం
దీంతో వైసీపీ శ్రేణులు సోష‌ల్ వేదిక‌గా చంద్ర‌బాబు అండ్ కోపై పెద్ద ఎత్తున యాంటీ ప్ర‌చారం చేస్తున్నాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సోష‌ల్ వేదిక‌గా రెచ్చిపోయారు. ఆయ‌నొస్తున్నారు! అంటూ డిజిట‌ల్ మాధ్య‌మాల్లో ప్ర‌చారాన్ని కేక పుట్టించారు. ఈ ప్ర‌చారం అప్ప‌ట్లో బాబుకి భారీ ప్ల‌స్ అయింది. అయితే, ఇప్పుడు ఎందుకో తాజా ఉప ఎన్నిక‌లో ఆయ‌న సోష‌ల్ మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే, వైసీపీ మాత్రం సోష‌ల్ మంత్రాన్ని ప‌ఠిస్తోంది. వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా ఆ పార్టీ సీనియ‌ర్లు.. పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో టీడీపీపై కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఇక‌, ప్రశాంత్ కిశోర్ అయితే, వేరే వేరే పేర్ల‌తో వంద‌ల కొద్దీ అకౌంట్లు తెరిచి మ‌రీ బాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నాడు. జగన్‌ కూడా ఎన్నడూ లేని విధంగా ట్విటర్‌, ఫేస్‌బుక్‌లలో కామెంట్లతో యాక్టివ్‌గా ఉంటున్నారు. వాస్తవానికి జగన్‌ 2009నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీగా మారినా.. సోషల్‌ మీడియాను అంతగా పట్టించుకోలేదు. తాజాగా ప్రతి అంశంలోనూ తన అభిప్రాయాలను కార్యకర్తలతో పంచుకుంటున్నారు. ఇదంతా ప్రశాంతకిషోర్‌ వ్యూహంలతో భాగంగానే జరుగుతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మ‌రి ఈ పోరు.. వైసీపీకి ఎంత ప్ల‌స్ అవుతుందో చెప్ప‌లేం కానీ.. టీడీపీకి అయితే దెబ్బేన‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *