మీరు డిగ్రీ పాస్ అయ్యారా..ఈ  కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయండి..జీతం ఎంతో తెలుసా..??

నాబార్డ్ ( నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్ ప్రకటించింది కేవలం డిగ్రీ అర్హతతో నాబార్డ్ ఏ గ్రేడ్ పోస్టులను భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెప్టెంబర్ 2 , 2023 తేదీన ఈ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. సుమారు 150 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ఈ ప్రకటన తెలిపింది.  నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..

Madhya Pradesh: NABARD To Hold Mango Festival On Jun 10 To Showcase Produce  Of Tribal Farmers

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే విద్యార్ధుల వయసు 21 నుండీ 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కలిగిన కేటగిరీ అభ్యర్ధులకు వయో సడలింపు వర్తిస్తుంది. జనరల్ కేటగిరి అభ్యర్ధులు పరీక్ష ఫీజుగా రూ. 800 చెల్లించాల్సి ఉండగా రిజర్వేషన్ కలిగిన అభ్యర్ధులు కేవలం రూ. 150 చెల్లించితే సరిపోతుంది. ఈ దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ధరఖాస్తు అభ్యర్ధన చివరి తేదీ సెప్టెంబర్ 23 ,2023.

 

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

జనరల్ -77

కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 40

కంపెనీ సెక్రెటరీ – 03

ఫైనాన్స్ -15

ఎలెక్ట్రికల్ ఇంజనీరింగ్ – 03

సివిల్ ఇంజనీరింగ్ – 03

ఇన్మోమాటిక్స్ – 02

ఫారెస్ట్రి – 02 

స్టాటిస్టిక్స్ – 02

ఫుడ్ ప్రాసెసింగ్ – 02

మీడియా స్పెషలిస్ట్  – 01

 

ఎంపిక విధానం

ముందుగా ప్రాధమిక పరీక్ష, ఆ తరువాత ప్రధాన పరీక్ష , ఇంటర్వ్యూ ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్ 16 ,2023 న ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హత పొందిన అభ్యర్ధులకు నెలకు జీతం రూ. లక్షకు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ నోటిఫికేషన్ కు సంభందించి పూర్తి వివరాలకోసం https://www.nabard.org/

 

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *