పవర్ స్టార్ తల్లి గా “ఆ స్టార్ హీరోయిన్”…!!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లో తమదైన శైలిలో దూసుకుపోతూనే మరోవైపు వరుస సినిమాలను చేస్తూ అటు అభిమానులను, ఇటు పార్టీ శ్రేణులను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉస్తాద్  భగత్ సింగ్ అనే మాస్  సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే

Pawan Kalyan Upcoming Movies List 2023, 2024 & Release Dates

సుజీత్ దర్శకత్వంలో వస్తున్న మరొక సినిమా OG  (వర్కింగ్ టైటిల్). ఈ రెండు సినిమాలపై కూడా అభిమానుల్లో, సిని వర్గాల్లో భారీ  అంచనాలే ఉన్నాయి. సుజిత్ గతంలో రన్ రాజా రన్, సాహు వంటి చిత్రాలను అందించి మంచి సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా సుజిత్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 60 శాతం పైగా పూర్తయినట్టుగా తెలుస్తోంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఈ సినిమాకు కేటాయించినట్టుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే…

Pawan Kalyan's new film OG with Sujeeth officially launched. See pics -  Hindustan Times

పవన్ చేస్తున్న మరొక సినిమా ఉస్తాద్  భగత్ సింగ్ ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా  జరుపుకుంటోంది.  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తల్లి పాత్రలో అలనాటి స్టార్ హీరోయిన్ గౌతమి నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *