ఏం చేద్దాం…జుట్లు పీక్కుంటున్న జనసేన, బీజేపీ..!!!  

తెలంగాణలో మొన్నటి దుబ్బాక, నిన్నటి  జీహెచ్ఎంసి ఎన్నికల్లో  విజయబావుటా ఎగురవేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ స్పీడు చూసి  టీఆర్ఎస్ పార్టీ సైతం ఖంగుతిన్నదట. ఇదే ఊపును ఏపీలో కూడా కొనసాగించాలని, రానున్న తిరుపతి ఉపఎన్నికల్లో తన సత్తా చాటాలని ఏపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా తిరుపతి ఉప ఎన్నిక , ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడానికి ఇరు పార్టీల నేతలు కీలక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సోము వీర్రాజు, బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవ్ధర్ కూడా పాల్గొన్నారు.

 

ఏలూరు లో ప్రజారోగ్య విషయంలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది, ఈ విషయాన్ని నరేంద్ర మోడీ కి తెలియజేసి కేంద్ర బృందాలను పంపి విచారణ చేయించేలా మోడీ కి విజ్ఞప్తి చేయాని నిర్ణయం తీసుకున్నారని, అలాగే ఏపీలో అభివృద్ధి కుంటుపడిందని, రోడ్ల పరిస్థితి మరీ అద్వానంగా మారిందని ఈ విషయంలో ఏపీ ప్రభుతాన్ని ఇరుకున పెట్టె ప్రయత్నం చేసిన తిరుపతి ఎన్నికల్లో విజయం సాధించాలనే దిశగా ఈ సమావేశం జరిపినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు

Pawan Kalyan in Delhi to Meet BJP Senior Leader over Tirupati Lok Sabha seat

ఏపీలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్న నేపధ్యంలో ఇరు పార్టీలు అభ్యర్ధుల విషయంలో ఓ నిర్ణయానికి రావాలని, ఇరు పార్టీల కార్యకర్తలు నేతలు కలిసికట్టుగా పనిచేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే. పై స్థాయి నేతలకు జనసేన, బీజేపీ ల కలయికపై సదాభిప్రాయం ఉన్నా జనసేన పార్టీలోని మెజారిటీ కార్యకర్తలు నేతలకు బీజేపీ తో కలిసి పనిచేయడం అస్సలు నచ్చడం లేదని తెలుస్తోంది.

బీజేపీ, జనసేన ముఖ్య నేతల భేటీ: కీలక అంశాలపై చర్చ

ఈ రోజు జరిగిన సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ కంటే కూడా  గ్రామ స్థాయిలో బలంగా ఉన్నామని ఇప్పుడు వారితో కలిసి వెళ్ళమంటే ఎలా అంటూ పార్టీ నేతలను కార్యకర్తలు, అభిమానులు నిలదీస్తున్నారట. ఈ పరిణామాల నేపధ్యంలో రానున్న తిరుపతి ఉపఎన్నిక అలాగే ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరు పార్టీల  కార్యకర్తలు, కొందరు నేతలను ఎలా సముదాయించాలో తెలియక జుట్లు పీక్కుంటున్నారట ఇరు పార్టీల కీలక నేతలు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *