స్టార్ డైరెక్ట‌ర్ కూతురితో అఖిల్ ప్రేమాయ‌ణం..

స్టార్ డైరెక్ట‌ర్ కూతురితో అఖిల్ ప్రేమాయ‌ణం ఏంట‌బ్బా అని అంద‌రూ స్ట‌న్ అవ్వ‌క త‌ప్ప‌దు. అఖిల్ ఎంతో ఇష్ట‌ప‌డి ప్రేమించిన ల‌వ‌ర్ శ్రియాభూపాల్‌తో అత‌డి ప్రేమాయ‌ణం పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే ఎంగేజ్‌మెంట్‌తోనే బ్రేక‌ప్ అయ్యింది. మ‌రి అఖిల్ అప్పుడే మ‌రోసారి ప్రేమాయ‌ణం మొద‌లెట్టేశాడా ? అయితే ఆ అమ్మాయి ఎవ‌రు ? అన్న డౌట్లు మ‌న‌కు వ‌చ్చేస్తాయి.
అయితే అఖిల్ స్టార్ డైరెక్ట‌ర్ కూతురితో న‌డుపుతోన్న ప్రేమాయ‌ణం రియ‌ల్ లైఫ్‌లో కాదు…రీల్ లైఫ్‌లో కావ‌డం విశేషం. అఖిల్‌ తొలి సినిమా అఖిల్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ అవ్వ‌డం, త‌న ప్రేమ ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత బ్రేక‌ప్ అవ్వ‌డంతో అఖిల్ చాలా వ‌ర‌కు డిజ‌ప్పాయింట్ అయ్యాడు. ఇక ఇప్పుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న రెండో సినిమాలో న‌టిస్తున్నాడు.
ఈ సినిమాలో మ‌ళ‌యాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె కళ్యాణిని హీరోయిన్‌గా ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ – మాజీ స్టార్ హీరోయిన్ లిజి దంప‌తుల కుమార్తె. ఈ జంట కొద్ది రోజుల క్రితం విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *