“వాలంటీర్లే”.. జగన్ బలం..బలగం..!!

జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రజలకు , ప్రభుత్వానికి వారధులుగా ఉండేందుకు, ప్రజల అవసరాలను దగ్గర ఉండిమరీ తీర్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థని ఏర్పాటు చేశారు. మొదట్లో వాలంటీర్ల వ్యవస్థపై ప్రతిపక్షాలు, విమర్శకులు ఎన్నో విమర్శలు చేశారు. జగన్ తన స్వార్ధం కోసమే డబ్బులు వృధాగా కర్చు పెడుతూ కార్యకర్తలను సిద్దం చేసుకుంటున్నారు అంటూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడారు.అయితే

Jagan rolls out grama and ward volunteer system - The Hindu

ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు విస్తృతంగా అలుపెరుగకుండా చేసిన సేవలకు ప్రజలు అందరూ సంతోషం వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. క్రమ క్రమంగా వాలంటీర్ల నిస్వార్ధ సేవలు ప్రజలకి అర్ధమయ్యాయి. ప్రభుత్వం కల్పించే అన్ని రకాల సేవలు వాలంటీర్ల ద్వారా పొందుతున్నారు ఎలాంటి అవసరమైన అందుబాటులో ఉంటూ, ప్రజలకి పధకాలపై అవగాహన కల్పిస్తూ అర్హులను పధకాలలో చేర్చుతూ వాలంటీర్లు చేస్తున్న సేవలు అనిర్వచనీయమనే చెప్పాలి. జగన్ ని విమర్శించిన వాళ్ళే వాలంటీర్ల వ్యవస్థ అద్భుతమని పొగడటం వారి సేవలకి నిజమైన గుర్తింపనే చెప్పాలి.

ఒక రకంగా చెప్పాలంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అందరికంటే జగన్ కి అత్యంత బలం బలగం వాలంటీర్ల వ్యవస్థ అనేది అందరి అభిప్రాయం. అందుకే జగన్ వారి అనుపమాన సేవలను గుర్తించారు. అలుపెరుగకుండా పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధాన కర్తలుగా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ , సచివాలయ వ్యవస్థ నేటికి సంవసత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా  వాలంటీర్లు, సచివాల ఉద్యోగులను చప్పట్లతో అభినందించారు.

News18 Telugu - గ్రామ వాలంటీర్ జీతం రూ.8000... సీఎం జగన్ మరో కీలక నిర్ణయం ?  | ap cm Jagan To Hike Grama Volunteers' Salary- Telugu News, Today's Latest  News in Telugu

ప్రభుత్వ ఉన్నత అధికారులతో సీఎం జగన్ చప్పట్లతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు జగన్ పిలుపు మేరకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు అందరూ సాయంత్రం 7 గంటలకు వీధుల్లో నిలబడి వారికి చప్పట్లతో అభినందనలు తెలుపాలని ప్రకటించారు. దాంతో ప్రతీ ఒక్క కుటుంభం వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలిపుతూ చప్పట్లతో అభినందించారు

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *