జ‌న‌సేన‌కు ముగ్గురు ఎంపీలు రెడీ

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ అవుతోన్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఇప్ప‌ట‌కీ పూర్తిస్థాయిలో త‌న పొలిటిక‌ల్ కార్యాచ‌ర‌ణ స్టార్ట్ చేయ‌లేదు. ప‌వ‌న్ ఓ వైపు షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమాలో చేస్తోన్న ప‌వ‌న్ ఈ సినిమా త‌ర్వాత నీశ‌న్ లేదా సంతోష్ శ్రీనివాస్ సినిమా చేస్తాడ‌ని టాక్‌. మ‌రోవైపు జ‌న‌సేన సైనికుల ఎంపిక‌లు జ‌రుగుతున్నాయి.
ప‌వ‌న్ ఇంకా పూర్తి స్థాయిలో రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌క‌పోయినా ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఎవ‌రి ఏర్పాట్ల‌లో వాళ్లు ఉన్నారు. జ‌న‌సేన‌కు ఇప్ప‌టికే కొన్ని చోట్ల అభ్య‌ర్థుల‌ను అనుకుంటున్న‌ట్టు ఊహాగానాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే మూడు ఎంపీ సీట్ల‌కు జ‌న‌సేన నుంచి వీరే పోటీ చేస్తారంటూ ఏపీలో ఊహాగానాలు మొద‌ల‌య్యాయి.
ఈ క్ర‌మంలోనే కృష్ణా జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల‌కు జ‌న‌సేన నుంచి అభ్య‌ర్థుల పేర్లు కూడా తెర‌మీద‌కు రావ‌డం విశేషం. విజ‌య‌వాడ‌కు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేశినేని రాజేంద్రప్ర‌సాద్ పేరు వినిపిస్తోంది.  బంద‌రు నుంచి మాజీ ఎంపీ బాడిగ రామ‌కృష్ణ పేరు లైన్లో ఉంది. గ‌తంలో ఆయ‌న బంద‌రు ఎంపీగా ప‌నిచేశారు. బాడిగ‌ను నిల‌బెట్టేందుకు జ‌న‌సేన‌, ప‌వ‌న్ అభిమానులు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.
ఇక కాకినాడ నుంచి ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు పేరు వినిపిస్తోంది. మ‌రి ఈ ముగ్గురు ఫైన‌ల్ అవుతారా ?  లేదా ప‌వ‌న్ ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే అప్పటి ప‌రిణామాలు ఎలా మార‌తాయో ?  చూడాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *