ఆ ఎమ్మెల్యేకు లోకేశ్ టార్చ‌ర్‌..

వైసీపీ నుంచి జంప్ అయ్యి టీడీపీలోకి  వచ్చిన ఓ ఏమ్మల్యేకి లోకేష్ నుంచి పెద్ద షాకే తగిలింది. లోకేష్ ఒకేసారి ఆ ఎమ్మల్యేని పార్టీ నేతలు అందరు ఉండగానే నోటికి వచ్చిన బూతులు తిట్ట‌డంతో వెంటనే ఆ ఏమ్మల్యే కన్నీటి పర్యంతం అయ్యాడని స‌మాచారం. ఈ విష‌యం బ‌య‌ట‌కు రావ‌డంతో అస‌లు ఏమైందా ? అని అంద‌రూ ఆరా తీస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే ప్ర‌కాశం జిల్లా గిద్ద‌లూరు మాజీ ఎమ్మల్యే అన్నా రాంబాబు.. ఉరుములు లేని పిడుగులాగా క‌నీసం ఎలాంటి సూచ‌న‌లు చేయకుండానే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు.

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును భహిరంగంగా వేదికమీద నుంచే తిడుతూ తను వేసుకున్న టీడీపీ కండువాను  విసిరికొట్టి వెళ్ళిపోయారు. ఈ పరిణామంతో ఖంగు తిన్న టీడీపీ కార్యకర్తలు,పార్టి శ్రేణులు అందరు ఒక సీనియర్ నాయకుడు ఇలా చేయడం వెనుక ఏం జరిగి ఉంటుంద‌ని ఆరా తీశారు. రాంబాబు పార్టీకి రాజీనామా చేయ‌డం వెన‌క గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డే అని త‌న‌కు నివేదిక అంద‌డంతో లోకేశ్ అంద‌రిముందే ఆయ‌న‌పై ఫైరైపోయారు.

వాస్తవానికి అన్నా రాంబాబుకి, అశోక్ రెడ్ది కి ఎప్పటి నుంచో గొడవలు జరుగుతున్నాయి. అశోక్‌రెడ్డి ఆధిప‌త్యం పెరగ‌డంతో త‌ట్టుకోలేని రాంబాబు చివ‌ర‌కు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టికి ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న రాంబాబు ఇలా చేయడం తో షాక్ తిన్న లోకేష్  అశోక్ రెడ్డిపై తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశాడట‌. లోకేష్ అందిరిముందు త‌న‌ను అలా టార్చ‌ర్ చేస్తూ ప్ర‌శ్న‌లు వేయ‌డంతో అశోక్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విష‌యంపై ఏపీ టీడీపీలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. ఇప్పుడు టీడీపీలో ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకుల కంటే వైసీపీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రయారీటి ఇస్తున్నారని ఇప్పటికే చాల మంది సీనియర్ లు అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *