త్రిఫల..వాడితే చాలు మీ ఆరోగ్యం పధిలం…

వాతం, పిత్తం, క‌ఫం ఈ మూడు మనిషి శరీరంలో సరైన స్థాయిలో ఉంటే మనకి ఎటువంటి రోగాలు మన దరిచేరవు కాని వాతం, పిత్తం, క‌ఫం వీటిలో ఏది సరిగా లేకపోయినా అవి ఆరోగ్యపరంగా మనిషి అనేక రకాలుగా అనరోగ్యుడిని చేస్తాయి. మన శరీరంలో ఈ మూడు సమాన స్థాయిలో ఉండి పూర్తి ఆరోగ్యం ఇవ్వాలంటే… అది స‌ర్వ‌రోగ నివార‌ణి త్రిఫ‌ల చూర్ణం తోనే సాధ్యం. ఇది ప్రకృతి సిద్ధమైన యాంటీ బైయోటిక్. మన శరీరాన్ని శుభ్రం చేయడంతో మనకు ఎంతగానో ఉపకరించే ఆయుర్వేద ఔషధం త్రిఫల చూర్ణం.

ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమమే త్రిఫల‌ చూర్ణం.  త్రిఫల‌ చూర్ణాన్ని త్రిదోష రసాయనంగా చెబుతారు. మన శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలను ఈ చూర్ణం సరిచేస్తుంది. వాతం నాడీ వ్యవస్థకు, పిత్తం జీవనక్రియలకు, కఫం శరీర నిర్మాణానికి సంబంధించినది. ఈ మూడు కాయలను సమాన పాళ్లలో తీసుకుని గింజలు తీసేసి మెత్తని చూర్ణంగా చేయాలి. ఈ పౌడర్‌ని ప్రతి రోజు రాత్రి అర టీస్పూను చొప్పున వేడి నీళ్లతో ఒక నెల వాడాలి. ఇది మనకి పూర్వం నుండి వస్తున్న ఒక మహత్తరమైన మందు అందుకే ఇప్పటికి గ్రామీణ ప్రజలు వీటిని తప్పనిసరిగా వాడుతూ ఉంటారు.

ఈ చూర్ణంలో వాడే కరక్కాయ చాలా శక్తివంతమైనది. అయితే దీనిని ఉపవాసం ఉన్నవారు, గర్భిణులు, శరీరంలో పిత్త దోష గుణం ఉన్నవారు వాడకూడదు. దీనిని త్రిఫలా చూర్ణంతోనే కాక ప్రత్యేకంగా కూడా వాడవచ్చు. పలు రకాల జీర్ణ సంబంధ, శ్వాస సంబంధ వ్యాధులకు ఇది చక్కగా పని చేస్తుంది. దీనిని క్రమబద్ధంగా నోటితో చప్పరిస్తే ఇది అజీర్ణానికి మంచి విరుగుడు. జీర్ణశక్తిని పెంచుతుంది. కరక్కాయతో ఏదైనా ఔషధాన్ని తయారుచేసుకుని వాడుతున్నవారు తప్పనిసరిగా తమ ఆహారంలో ఆవు నెయ్యిని వాడాలి. ఎందుకంటే ఆవు నెయ్యిలో వేడి గుణం హెచ్చుగా ఉంటుంది. త్రిఫ‌ల చూర్ణం త‌గు మాత్రం వాడితే మ‌న శ‌రీరంలోని దోషాలు నివార‌ణ అయిపోతాయి.

 

Also Read.:

మీ భార్య శుక్రవారం ఇలా చేస్తే చాలు..వద్దంటే డబ్బు వస్తుందట

http://www.telugustarnews.com/telugu/lakshmi-devi-puja-is-solution-to-financial-problems/

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *