రివ్యూ – లై …

టైటిల్‌- లై

జాన‌ర్‌-స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు-నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ, మ‌ధుసూధ‌న్‌, రాజీవ్‌క‌న‌కాల‌, పూర్ణిమ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ- యువ‌రాజ్‌
మ్యూజిక్‌- మ‌ణిశ‌ర్మ‌
ఎడిటింగ్ఎ- ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నిర్మాత‌లు- రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం- హ‌ను రాఘ‌వ‌పూడి
సెన్సార్ రిపోర్ట్‌–  యూ/ఏ
రిలీజ్ డేట్‌: 11 ఆగ‌స్టు 2017

మైండ్ గేమ్ తో వచ్చే సినిమాలని  ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు నితిన్ కొంత గ్యాప్ తరువాత చేసిన సినిమా ‘లై’ ఒక తెలివైన హీరో ,మరోవైపు పవర్ఫుల్ విలన్ మధ్య సాగే మైండ్ గేమ్ సినిమా ఇది. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ తరువాత హను రాఘవపూడి దర్సకత్వంలో వచ్చిన సినిమా లై ఈ సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా? లేదా ? ఒకలుక్కేద్దాం..

క‌థః

    ఈ సినిమాలో సత్యం (నితిన్) ఏ భాద్యతా లేని సత్యం పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని సెట్ అవ్వాలని అనుకుంటాడు అందుకు లాస్ వేగాస్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటాడు.కొన్ని విచిత్రకరమైన పరిస్థితుల మధ్య చైత్ర (మేఘా ఆకాష్‌) పరిచయం అవుతుంది జ‌ర్నీలో. ఈ జర్నీ లోనే ఇద్దరు ప్రేమలో పడతారు. అనుకోకుండా ఒక సూట్ కోసం పద్మనాభం (అర్జున్ ) ప్లానింగ్ చేస్తుంటాడు. ఈలోగా ఆ సూట్ కోసం సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ బృందం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అసలు ఆ సూట్ లో ఏముంటుంది? హీరో కి విలన్ కి ఉన్న కనెక్షన్ ఏమిటి అనేది సినిమాలో చూడాల్సిందే

lai nitin movie images కోసం చిత్ర ఫలితం

 పెర్‌ఫార్మెన్స్ః

నితిన్ సినిమాలు ఎప్పుడు ఫ్యామిలీ ఓరియెంటెడ్ గా, ప్రేమ కధ నేపద్యంలో సాగిపోతాయి ఫస్ట్ టైం నితిన్ ఒక కొత్త తరహా పాత్రలో,చాలా స్టైలిష్ గా కనిపించి నటించి మెప్పించాడు ఎ.సత్యం గా నితిన్ నటన అదుర్స్ అని చెప్పొచ్చు. స్టైలిష్ లుక్ లో నితిన్ బాగా ఆకట్టుకున్నాడు. అఆ తర్వాత నితిన్ ఈ సినిమాతో రావడం అతని కెరియర్ కు మంచి హెల్ప్ అవుతుంది. ఇక చైత్రగా మేఘా ఆకాష్ మంచి నటన కనబరిచింది. మొదటి సినిమానే అయినా ఆమె మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. విలన్ గా అర్జున్ అదరగొట్టాడు. స్టైలిష్ విలన్ గా అర్జున్ కు మంచి పేరొస్తుంది. శ్రీరాం, అజయ్, నాజర్, రవి కిషన్, బ్రహ్మాజి, పృధ్విరాజ్, బ్రహ్మానందం అంతా మంచి నటన కనబరిచారు.  హను రాఘవపూడి మంచి థ్రిల్లర్ తో లై తీశాడు. యాక్షన్ సీన్స్ లో హైలెట్ గా వచ్చిందని చెప్పొచ్చు. మణిశర్మ మ్యూజిక్ అయితే పీక్స్. కెమెరామెన్ కూడా బాగా వర్క్ అవుట్ చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడ రాజి పడలేదు. సినిమాను ఎంత రిచ్ గా తీశారో సినిమా తెర మీద చూస్తేనే అర్ధమవుతుంది. అయితే కథ కథనాల్లో కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. సినిమా ఎంత స్టైలిష్ గా అనిపించినా కొద్దిగా అక్కడక్కడ ల్యాగ్ అయినట్టు చెప్పొచ్చు. అర్జున్ విలన్ గా బాగా నటించాడు . తను రాసుకున్న కథకు పర్ఫెక్ట్ యాక్టర్స్ ను ఎంపిక చేసుకున్నాడు హను రాఘవపూడి  స్టైలిష్ అండ్ థ్రిల్లింగ్,మైండ్ గేమ్, మూవీగా నితిన్ లై ఆడియెన్స్ మెప్పుపొందే అవకాశం ఉంది.

ప్లస్ పాయింట్స్ 

  • యాక్షన్ సీన్స్

  • సినిమాటోగ్రఫి

  • స్టార్ కాస్ట్

మైనస్ పాయింట్స్ 

  • ఎడిటింగ్

  • స్క్రీన్ ప్లే

  • రొటీన్ రివెంజ్ డ్రామా

రేటింగ్ — 2.75

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *