ఇండియన్ సినిమా చరిత్రలో సోగ్గాడి ఆస్తులతో పోటీ పడే హీరో లేడట…ఇంతకీ ఎన్ని కోట్లో తెలుసా….

సోగ్గాడు అంటే శోభన్ బాబని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఆయనకు ఆ సమయంలో ఉన్న లేడీస్ ఫాలోయింగ్ ఇప్పటి వరకూ ఏ హీరోకి కూడా లేదంటే అతిశయోక్తి కాదు. శోభన్ బాబు రింగ్ అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. శోభన్ బాబు హెయిర్ స్టైల్ కోసం, ఆ రింగ్ నుదిటిపై ఉండేందుకు కుర్రాళ్ళు అప్పట్లో విశ్వ ప్రయత్నాలు చేసేవారట. ఇక ఆయన స్క్రీన్ పై కనపడితే అదేపనిగా అమ్మాయిలు గుడ్లప్పగించి చూసేవారట. ఆయన క్రేజ్ ఆ రేంజ్ లో ఉండేదట. ఎన్నో సినిమాలు తీసిన శోభన్ బాబు తన సంపాదనలో సింహ భాగం కేవలం ఆస్తులు కూడ బెట్టేందుకు ఖర్చు చేసేవారట.

Shoban Babu | Actors images, Ab de villiers, Movie songs

ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఎన్ని కోట్లు ఉంటుందో కూడా చెప్పడం కష్టం అంటున్నారు ఆయన మిత్రుడు చంద్రమోహన్. ఆయన ఆస్తులు మొత్తం లెక్కేస్తే ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఏ ఒక్క హీరో, ఏ ఒక్క నిర్మాత కూడా ఆయనతో పోటీ పడలేరని అంటున్నారు. భూమి ఎన్నటికి పెరగదు అందుకే భూమిపై పెట్టుబడి పెట్టండి అంటూ తన సన్నిహితులకు చెప్పేవారట. ఈ క్రమంలోనే ఆయన చెన్నై లో ఆస్తులు భారీగా కొనుగోలు చేశారని అప్పట్లో అన్నానగర్ లో దాదాపు 20 వరకూ ఆస్తులు ఉండేవాట. అంతేకాదు ఆ ఆస్తులు చూసుకుని రావడానికి శోభన్ బాబుకు ఒక పూట పట్టేదట. అన్నా నగర్ ప్రస్తుతం చెన్నై లో అత్యంత ఖరీదైన ప్రాంతం. ఈ నగరంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని

Sobhan Babu birthday Special: తెలుగువారి సోగ్గాడు.. నట భూషణుడు శోభన్ బాబు

శోభన్ బాబుకు సుమారు 30 ఎకరాలు ఉందట. ప్రస్తుతం అక్కడ ఒక ఎకరం కోట్ల రూపాయలు పలుకుతోంది అప్పట్లో ఆ మొత్తాన్ని శోభన్ బాబు 30 లక్షలకు కొనుగోలు చేశారట. వరుసగా భూమిపై పెట్టుబడులు పెడుతూ వచ్చిన శోభన్ బాబు కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మరీ తన ఆస్తుల పెంపుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఆస్తులను చూసుకోవడానికి 30 మంది మేనేజర్ లు ఉండేవారట. వారందరికి పైన ఒక సీనియర్ మేనేజర్ ఉండేవారట. ఇలా తన చెన్నై లో తన సామ్రాజ్యాన్ని విస్తరించారు. అంతేకాదు అన్నా నగర్ లో సింహభాగం శోభన్ బాబుదే నంటే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఆయన కుమారుడు శోభన్ బాబు ఆశయాలను ముందుకు నడిపిస్తూ రియలెస్టేట్ రంగంలో దూసుకుపోతున్నారట. ఏది ఏమైనా ముందు చూపు అంటే శోభన్ బాబు లెక్క ఉండాల్సిందే.

 

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *