“వినయ విధేయ రామ” తో రీ ఎంట్రీ ఇచ్చిన…“ఆ హీరో”

బోయపాటి, రాంచరణ్ కాంబో లో మొదటి సారిగా రాబోతున్న సినిమా  “వినయ విధేయ రామా” ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ అయ్యి ఎంతటి సంచలనం సృష్టించిందో వేరే చెప్పనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మెగా అభిమానులకి ఇది కన్నుల పండుగ అనే చెప్పాలి…ఈ సినిమాలో బోయపాటి రాంచరన్ ని చూపించిన తీరు ఈ సినిమా ఫుల్ మాస్ సినిమాగా ఉండబోతోందని అర్థమవుతున్నా..

ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టుగా ఈ టీజర్ లో ఒక్క సీన్ కూడా లేకపోవడంతో ఈ సినిమాలో వినయ విధేయంగా ఉండే రాముడు ఎలా ఉంటాడోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాలో మరొక ప్రత్యేక కూడా ఉంది అదేంటంటే..ఈ సినిమాలో రాంచరణ్ తన సొంత ఇంటి పేరునే సినిమాలో వాడటం జరిగింది.అదే డైలాగ్ టీజర్  లో కూడా ఉంది ఇక ఈ సినిమాలో ఓ దిగ్దర్సకుడి కొడుకు సైతం నటించడం విశేషం..గతంలో ఆ నటుడు హీరోగా ఎన్నో సినిమాలు కూడా చేశారు కానీ సక్సెస్ కాలేక పోయారు అయితే

ఆయన తమ్ముడు మాత్రం కామెడీ సినిమాలతో ఫుల్ పాపులర్ అయ్యి మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు..ఇంతకీ ఆ నటుడు ఎవరనే కదా ఎవరో కాదండి ఈవీవీ సత్యనారాయణ గారి అబ్బాయి ఆర్యన్ రాజేష్. అల్లరి నరేష్ అన్నయ్య. ఆర్యన్ గతంలో కొన్ని సినిమాలలో నటించినా ఒక్క సక్సెస్ రాలేదు ఆ తరువాత తన బిజినెస్స్ లలో బిజీ బిజీ అయిపోయాడు.ఇక ఇప్పుడు తన రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.మరి ఈ సినిమాలో అతడి పాత్ర ఎంతవరకూ ఉంది…తన రీ ఎంట్రీ కి ఎంతవరకూ చెర్రీ సినిమా ఊతం ఇస్తుందో వేచి చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *