ఇంతకంటే ఏం కావాలి..సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫోటో..

ఇక్కడ ఫోటో లో ఓ పోలీస్ అధికారి ఓ మహిళా పోలీస్ అధికారిణికి సెల్యూట్ చేస్తున్నారు. ఇందులో వింత ఏంటి అనుకుంటున్నారా వింత లేదు కానీ ఓ కింత సంతోషం, ఒకింత గర్వం ఒలికిన చిత్రం ఇది. సెల్యూట్ చేస్తున్న అధికారి ఓ తండ్రి,  అయితే సెల్యూట్ చేయించుకునే స్థాయిలో ఉంది కూతురు అయితే ఇప్పుడు చూడండి ఆ ఫోటో ఎంత గర్వంగా ఉంటుందో. తెలుగు రాష్ట్రాల విభజన తరువాత పోలీస్ శాఖ నిర్వహిస్తున్న పోలీస్  “డ్యూటీ మీట్- 2021”  లో జరిగిన సంఘటన ఇది.

ఏపీలో క్యా సీన్ హై.. పోలీస్ కూతురికి పోలీస్ నాన్న పోలీస్ సెల్యూట్..

2018 బ్యాచ్ కి చెందిన జెస్సీ ప్రశాంతి గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి శ్యాం సుందర్ తిరుపతి డ్యామ్ లో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో సిఐ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరూ కలిసి తిరుపతి లో నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్ లో కలుసుకోగా తండ్రి ఉన్నత అధికారి అయిన తన కూతురుని చూసి సెల్యూట్ చేయగా క్లిక్ మనిపించిన దృశ్యమది. తండ్రి ఒక్క సారిగా సెల్యూట్ చేయగానే నాన్నా అంటూ ఆమె నవ్వడం ఆ సంఘటన చూసిన అందరూ చిరునవ్వులు చిందించడం జరిగింది.

ఏపీలో క్యా సీన్ హై.. పోలీస్ కూతురికి పోలీస్ నాన్న పోలీస్ సెల్యూట్..

పిల్లలు ప్రయోజకులు అయితే అది కూడా తానూ పనిచేస్తున్న శాఖలో ఉన్నత అధికారిగా తన ముందు కనపడితే ఏ తల్లి తండ్రులకైనా అంతకు మించి కావాల్సింది  ఏముంటుంది చెప్పండి. బహుశా సినిమాలలో మాత్రమే ఇలాంటి అరుదైన సంఘటనలు చూస్తుంటాం నిజ జీవితంలో ఇలాంటివి జరిగితే ఆ కిక్కే వేరు కదా..

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *