ఒకే జ‌న్మ‌రాశి క‌ల స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటే ఏమ‌వుతుందో తెలుసా

ఒకే జన్మరాశి ఉన్న స్త్రీ పురుషులు వివాహం చేసుకుంటే మంచిదేనా? ఏదైనా కీడు జరుగుతుందా? అనే సందేహం చాలా మందికి వస్తుంది. వ్యక్తిత్వ లక్షణాలపై జన్మరాశులు ప్రభావం చూపుతాయి. అందుకే తమకు సరిపడే జన్మరాశుల వాళ్లను వివాహం చేసుకుంటే జీవితమనే ఫజిల్‌ను విజయవంతంగా పూర్తిచేయగలరని పురాతన పండితులు పేర్కొంటున్నారు.

– మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు అహం ఎక్కువ. ఇదే రాశికి చెందిన స్త్రీపురుషులు వివాహం చేసుకుంటే నిత్యం యుద్ధ వాతావరణమేనట.

– వృషభ రాశికి చెందిన వాళ్లలో స్థిరత్వం ఉంటుంది. ఈ రాశివాళ్లు వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుంది.

– మిథునరాశి వ్యక్తులు చాలా కూల్ గా ఉంటారు. వీరి ఎనర్జీ లెవెల్స్ చాలా అధికం. భార్యాభర్తల్లో ఒకరికి శక్తి తగ్గినట్లు అనిపించినా ఇంకొకరు బాధ్యతలను చేపట్టి పని పూర్తి చేస్తారు. ఇదే రాశికి చెందిన స్త్రీపురుషులు అనూహ్యంగా వివాహం చేసుకుంటే బంధం విజయవంతంగా సాగుతుందట.

– కర్కటక రాశిలో జన్మించిన వాళ్లు చాలా సున్నిత మనస్కులు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల బంధంలో ఉద్వేగాలు ప్రభావం చూపుతాయి. ఒకరి నుంచి ఒకరు కొత్త విషయాలు నేర్చుకుంటారట.

– సింహరాశి వ్యక్తులు అదే రాశికి చెందిన వారిని వివాహం చేసుకోకపోవడం మంచిదట. ఇలా జరిగితే ఒక సింహం మరో సింహాన్ని ఢీకొట్టడమేనట. ఒకే ఇంట్లో రెండు బాంబులు ఉన్నంత ప్రమాదమట.

– భార్యాభర్తలు ఇద్దరూ కన్య రాశి వ్యక్తులైతే వారికి తిరుగే ఉండదట. ఒకరిపై ఒకరికి ఎక్కువ ఆశ ఉంటుందట. నిస్వార్థమైన ప్రేమతో ఎప్పుడూ సంతోషంగా ఉంటారట.

– తుల రాశి వారు ఎదుటి వ్యక్తలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటారు. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్న దాన్ని వ్యక్తం చేయలేరట. ఎంత అభిమానమైనా మనసులో ఉంచుకుంటారట.

– వృశ్చికరాశికి హాస్య చతురత ఎక్కువ. ఈ రాశి వ్యక్తులకు పెళ్లి జరిగితే కొన్ని విషయాల్లో అసూయ, అపార్థాలు, అనుమానాలకు తావుంటుంది. రెండు వృశ్చికాలను కలపాలనుకోవడం అత్యాశే అవుతుందట.

– ధనస్సు రాశి వ్యక్తులు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. ఇలాంటి పోటీతో ఆనందాన్ని పొందుతారు.

– మ‌ఖ‌రాశికి చెందిన స్త్రీపురుషులు వివాహం చాలా సమ్మతమైందట. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవనం సాగిస్తారట.

– కుంభ రాశికి చెందిన స్త్రీపురుషులు వివాహం చేసుకుంటే ఆధ్యాత్మిక శక్తులను తట్టుకోవడం కష్టం. వీరిలో ఉండే ఆధునిక భావాలు, ఉదార స్వభావం ఇతరులను ఆకట్టుకున్నా కొన్ని సందర్భాల్లో ఉద్వేగాలు అదుపు చేసుకోలేరు. దీని వల్ల వైవాహిక బంధంలో బీటలు వారే ప్రమాదం ఉంటుంది.

– మీన రాశి వారికి అన్ని విషయాల్లోనూ ఓ విజన్ ఉంటుంది. ముందుచూపు కలిగిన ఇద్దరు వ్యక్తులు కలపాలనుకోవడం కలే అవుతుంది. కాబట్టి ఇలాంటి బంధాన్ని కలపడానికి ప్రయత్నించకపోవడం మంచిది. అద్బుతమైన కలలను సాకారం చేసుకోడానికి ఈ రాశికి చెందిన వ్యక్తులు నిరంతరం శ్రమిస్తూ ఉంటారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *