మోడీ ని వాడేస్తున్న ట్రంప్..రచ్చ చేస్తున్న వీడియో…!!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నవంబర్ లో జరగనున్న ఎన్నికల్లో గెలుపుకోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అత్యధిక మెజారిటీ ఉన్న అమెరికన్స్ ని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికే వలస విధానాలపై ఉక్కు పాదం మోపిన ట్రంప్ అమెరికన్స్ ని ఆకట్టుకోవడంలో మాత్రం సక్సెస్ సాధించారు. అయితే అమెరికాలో అమెరికన్స్ తో పాటు వలస వాసుల ఓట్లు కూడా గెలుపుకి కీలకం కావడంతో ట్రంప్ దృష్టి వలస వాసులపై పడింది. అయితే

 

వలస వీసాల విధానం పై ట్రంప్ నియంతలా వ్యవహరించడం కారణంగా వారి ఓట్లు పడతాయా లేదా అనే సందేహం ట్రంప్ క్యాంపైన్ కి పట్టుకుంది. దాంతో అత్యధిక జనాభా కలిగిన వలస వాసులుగా ఉన్న భారతీయుల ఓట్లు కోసం ట్రంప్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. భారతీయులకి మోడీ పై ఉన్న ప్రేమాభిమానాలను దగ్గరగా చూసిన మోడీ ఇప్పుడు అమెరికాలోని భారతీయుల ఓట్ల కోసం మోడీ ని వాడేసుకుంటున్నాడు.

 

గతంలో మోడీ అమెరికా పర్యటనలో నమో మోడీ కార్యక్రమంలో ట్రంప్ తో కలిసి పాల్గొన్న వీడియోలను అలాగే ట్రంప్ భారత పర్యటనలో భాగంగా మోడీ, ట్రంప్ కలిసి ఉన్న వీడియోలను జత చేసి ఎంతో ఉద్వేగభరితంగా వాటిని రూపొందించి బిగ్ స్క్రీన్స్ పై ప్రదర్శిస్తూ భారతీయ ఓట్ల కు  గేలం వేస్తున్నారు. ట్రంప్ కి మరో నాలుగేళ్ళు అవకాశం ఇవ్వండి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *