టీడీపీ ని “షేక్” చేస్తున్న…..“విజయమ్మ ప్రెస్ మీట్”

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి ఘటన టీడీపీ ప్రభుత్వానికి ఒక మాయని మచ్చగా మారింది.దాడి జరిగి ఇన్ని రోజులు అవుతున్నా సరే ఇప్పటికి కూడా కేసు దర్యాప్తు పై పురోగతి లేకపోవడం ఎన్నో మరెన్నో అనుమానాలకి తావిస్తోంది. అంతేకాదు ఈ కేసుని నీరు గారుస్తారు అనే విషయం కూడా ఏపీ ప్రజలకి అర్థమయ్యిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఇదిలాఉంటే

Image result for ys vijayamma press meet

ఈ దాడి నుంచీ మెల్లగా కొల్కున్న జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రని కొనసాగించడానికి సిద్దమయ్యారు.అయితే ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి జగన్ తల్లి అయిన వైఎస్ విజయమ్మ ప్రెస్ మీట్ పెట్టనున్నారని ఆదివారం ఉదయం 10 గంటలకి ప్రెస్ మీట్ ఉంటుందని విలేఖరులకి సందేశం పంపారు..దాంతో ఏపీలో సర్వాత్రా ఉత్ఖంట నెలకొంది..అసలే చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు పై బెంగ పెట్టుకున్న సమయంలో జగన్ పై జరిగిన దాడి టీడీపీపై మరింత దెబ్బ పడగా ఇప్పుడు విజయమ్మ ప్రెస్ మీట్ లో ఏమి మాట్లాడుతారో..ఏమంటారోనని తెగ టెన్షన్ పడుతున్నారట.

Related image

విజయమ్మ సంధించే ప్రశ్నలకి టీడీపీ పార్టీ షేక్ అవ్వడం ఖాయమని..జగన్ పాదయత్రకి అభిమానులు, వైసీపీ కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని నా కొడుకుని మీ చేతుల్లో పెడుతున్నాను అని విజయమ్మ ప్రజలకి విన్నవించుకోనున్నారని అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు పై ఘాటైన విమర్శలు చేయనున్నారని తెలుస్తోంది.

 

 

 

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఈరోజు 10 గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నారు.ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఏపీలో సంచలనం సృష్టిస్తోంది..విజయమ్మ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నారు..అందుకు గల కారణాలు ఏమిటి..? అనే విషయాలు టీడీపీ పార్టీలో  ఇప్పుడు అలజడి రేపుతున్నాయి..విజయమ్మ ప్రెస్ మీటి కోసం ఎదురు చూస్తున్నారు రాజకీయ నేతలు.

 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటన విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరించిన తీరు, దోషులని పట్టుకోవడంలో ఇప్పటికి కూడా వైఫ్యలం చెందటం అందరికీ తెలిసిందే. దాడి జరిగి ఇన్ని రోజులు అయినా సరే చంద్రబాబు సర్కార్ ఇప్పటికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు..పైగా కేసుని నీరుగార్చే పనిలో ఉందంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు..అయితే జగన్ తనకి తగిలిన గాయం నయం కావడంతో పాదయాత్రకి బయలు దేరారు.. ఈ నేపధ్యంలో విజయమ్మ ప్రెస్ మీట్ పై సర్వాత్రా ఆసక్తి నెలకొంది..

 

 

తనపై జరిగిన హత్యాయత్నం విషయంలో ఏపీలో ఎటువంటి అల్లర్లు జరగకుండా జగన్ ఎంతో హుందాగా అక్కడి నుంచీ వెళ్ళిపోయారు..ఈ విషయంలో సైతం జగన్ పై ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ. దోషులని పట్టుకోకపోగా , మీరు కావాలని సానుభూతి కోసం చేయించుకున్నారు అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా నిరసనలు పెల్లుబికాయి..అయితే ఈరోజు జరిగి విజయమ్మ ప్రెస్ మీట్ లో , నా భర్తను పోగొట్టుకున్న నేను నా బిడ్డ జగన్ ని మీ చేతుల్లో పెడుతున్నానని…తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి లాగానే  జగన్ వ్యక్తిత్వం ఉంటుందని..ఇచ్చిన మాట తప్పడం మాకు తెలియదని జగన్ బాబుని కంటికి రెప్పలా కాపాదకోవాల్సిన భాద్యత అభిమానులు వైసీపీ శ్రేణులలో ఉందని చెప్పనున్నారట విజయమ్మ.

 

విజయమ్మ మాట్లాడే మాటలు ఇప్పుడు జగన్ పాదయాత్రకి ఊపు ఇవ్వడమే కాదు..రాజకీయంగా కూడా వైసీపీ కలిసి రానున్నాయి అందుకే వైసీపీ విజయమ్మ తో ప్రెస్ మీట్ పెట్టి మరీ టీడీపీని ఏకేసే వ్యూహం రచించినట్టుగా తెలుస్తోంది..ఇదిలాఉంటే మరో పక్క జగన్ పాదయాత్ర తన సొంత సెక్యూరిటీ పరిధిలో సాగనుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో వైసీపీ నేతలు నిమగ్నమయ్యారు. అయితే జగన్ పై దాడి తరువాత విజయమ్మ ప్రెస్ మీట్ పెట్టడం ఆ తరువాతి పరిస్థితులు చంద్రబాబు నాయుడికి రాజకీయంగా కోలుకోలేని దెబ్బే అంటున్నారు విశ్లేషకులు.

 

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *