“ఎన్నికల రిజల్స్”… చూస్తున్నారా..ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే…!!!

ఏపీలో ఎన్నికలు ముగిసిన దాదాపు రెండు నెలల తరువాత ఎన్నికల ఫలితాలు రానున్న నేపధ్యంలో ,అందరిలో సర్వాత్రా ఉత్ఖంట నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు మొదలు వారి గెలుపుకోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేసిన పార్టీ ఒక్క వ్యక్తి ఈ రోజు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తున్నాడని పలు సర్వేలు తేల్చి చెప్పడంతో ఒక్క సారిగా టీడీపీ నేతల్లో , కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది.

ఈ రోజు మధ్యాహ్నం లోగానే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో తెలిపోనున్న నేపధ్యంలో అందరూ టీవీల ముందు కదలకుండా కూర్చుని రాబోయే రిజల్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారికి బీపీ, షుగర్ , పెరిగి పోవడం హెచ్చుతగ్గులు రావడం జరుగుతుందని. గుండె సంభదిత వ్యాధులు ఉన్న వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అంతేకాదు వారు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు.

  • టీవీల ముందు ఒక్కరు మాత్రం కూర్చోవద్దని , ఇద్దరు లేదా ముగ్గురు ఉండటం మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఫలితాల గురించి పక్కన వారితో చర్చస్తున్న సమయంలో ఒత్తిడి తగ్గినట్లుగా ఉంటుంది తద్వారా ఎటువంటి మానసిక ప్రభావం ఉండదు.
  • ఫలితాలను ఉగ్గబట్టి చూడకుండా కొద్ది నిమిషాల పాటు అటు ఇటూ తిరుగుతూ ఉండటం మంచిది.
  • మంచి నీళ్ళని అరగంట కి ఒక్కసారైనా తాగుతూ ఉండాలి. ఉత్కంఠతతో ఎదురు చూస్తూ మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది, కాబట్టి నీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి.  
  • మీరు వీక్షితున్న చానెల్ లో బ్రేక్ వస్తే ఆ ఛానల్ కొనసాగించడం అంతేకాని వేరే ఛానెల్ ని మాత్రం మార్చవద్దు. ఎందుకంటే యాడ్స్ చూడటం వలన ఒత్తిడి తగ్గుతుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *