ఈ సింపుల్ చిట్కాతో తెల్ల వెంట్రుకలు నల్లగా అవ్వాల్సిందే
చిన్నవయసులోనే ఇప్పుడు చాలా మందికి తలలో తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఇలాంటి పిల్లలు తెల్లబడిన జుట్టుతో బయటకు వెళ్లాలన్నా, నలుగురితో కలిసి తిరగాలన్నా తెగ ఆందోళన చెందుతున్నారు. ఇలా జరగడానికి కారణం జుట్టును నల్లగా ఉంచే మెలొనిన్ ఉత్పత్తి శరీరంలో తగ్గిపోవడమే. ఈ తెల్లజుట్టు కనిపించకుండా కొన్నిరకాల టిప్స్ , ట్రిక్స్ ఉన్నాయి.
చిట్కా-1 :
జుట్టులో కొన్ని పాయలు తెల్లగా ఉంటే ఆ ప్రాంతంలో కొద్దిగా మస్కారా రాసుకుంటే జుట్టులోని తెల్లదనాన్ని కవరప్ చేస్తుంది. ఇది ఇన్‌స్టాంట్ కిటుకు. అలాగే కాజల్‌ని కూడా తెల్ల వెంట్రుకలపై పూస్తే జుట్టు నల్లగా నిగ నిగలాడుతూ కనిపిస్తుంది.
చిట్కా-2 :
డార్క్ బ్రౌన్ లిప్‌స్టిక్‌ను కూడా తలలోని తెల్ల పాయాలపై అప్లై చేయొచ్చు. ఇవే కాకుండా ఇంట్లో వస్తువులతో కూడా తెల్లజుట్టు సమస్యను అధిగమించొచ్చు.
చిట్కా-3 :
100 మిల్లీ గ్రాముల కొబ్బరినూనెలో కరివేపాకు ఆకులు వేసి ఉడకబెట్టాలి. కరివేపాకు ఆకులు నల్లరంగులోకి మారిన తర్వాత దానిని పొయ్యి మీద నుంచి దించాలి. అది చల్లారిన తర్వాత దాన్ని బాగా పిండి అందులోంచి వచ్చిన ఆయిల్‌ని ఒక సీసాలో పోసి గట్టిగా మూతపెట్టాలి. ఈనూనెను ప్రతి రోజూ రాత్రిపూట తలకు రాసుకుని 20 నిమిషాలు పాటు మర్దనా చేసుకొని, ఆ మర్నాడు తలస్నానం చేయాలి. ఇలా 3, 4 సార్లు చేస్తే తెల్ల వెంట్రుకలు దాదాపుగా పోతాయి.
చిట్కా-4 :
జుట్టును నల్లగా ఉంచడంలో ఉసిరి, నిమ్మ కీలకపాత్ర పోషిస్తాయి. ఒక టీ స్పూన్ ఉసిరిపొడిని కప్పు నీళ్లల్లో కలిపి స్టవ్‌పై పెట్టి అది సగానికి వచ్చేవరకూ ఉడకనివ్వాలి. తర్వాత దానిని స్టవ్ మీద నుంచి దించి అందులో మూడు టీస్పూన్ల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమానికి కొంత నీరు కలిపి తలకు బాగా రుద్దుకుని నీళ్లతో కడిగేసుకోవాలి.
చిట్కా-5 :
నువ్వుల నూనె కూడా జుట్టు నల్లగా నిగ నిగ లాడేలా చేస్తుంది. వంద మిల్లీగ్రాముల నువ్వుల నూనె, 100 మిల్లీ గ్రాముల కమలాపండు రసం, 50 గ్రాముల మెంతుల పొడిని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు వారాల పాటు సూర్యరశ్మి కింద ఉంచాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలకు పెట్టుకుంటే జుట్టుకున్న తెల్లదనం పోతుంది.