సిట్టింగ్ ఏమ్మేల్యేలు 25 మందికి షాక్ ఇవ్వనున్న బాబు

2019 లో  జరగబోయే ఎన్నికల్లో అధికార పార్టీ సిట్టింగ్  ఎమ్మెల్యేలలో సుమారు 25 మందికి ఆశాభంగం కలగనుందా అంటే అవుననే అంటున్నాయి ప్రస్థుత పరిస్థితులు.ముఖ్యమంత్రి కి వచ్చిన నివేదికలు కానీ, ఇంటిలిజెన్సు ఇచ్చిన  ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల పనితీరు,ప్రజలలో వ్యతిరేకత వెరసి అన్నీ విషయాలని చాలా కూలంకుషంగా పరిశీలిస్తున్న చంద్రబాబు వారిలో చాలా మందికి వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే పరిస్థితి లేదని టాక్.

సాదారణంగా ఇంతవరకు ఎప్పుడూ సిటింగ్ ఎమ్మెల్యేలందరికి ఏ అధికార పార్టీ టిక్కెట్లు ఇవ్వలేదు. ఇందుకు తగ్గట్లుగా . ప్రత్యామ్నాయ నేతలను అన్వేషించాలని పార్టీ నాయకత్వం కొంతమందికి భాద్యతలని అప్పగించింది అని టాక్.ఈ ఈక్వేషన్స్ లో ముందుగా భారీ మార్పులు జరగబోయేది  పశ్చిమగోదావరి జిల్లాలోనే అని తెలుస్తోంది. ఎందుకంటే పశ్చిమలో ఏ పార్టీ  ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే వారే అధికారాన్ని దక్కించుకుంటారు అనే సెంటిమెంట్ కొన్నేళ్ళు గా  వస్తోంది. అందులోనూ పశ్చిమలో అధికార టీడీపికి ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ప్రజలలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కలిగే పనులు ఎప్పటికప్పుడు చేస్తూ,ఎప్పుడో పశ్చిమ వాసులకి దూరం అయ్యింది టీడీపి.అందుకే కొత్త ముఖాల కోసం వెతికే పనిలో ఉన్నారట చంద్రబాబు.

ఈ సమయంలో కొత్త ముఖాలు కనుకా వచ్చే ఎన్నికల్లో కనపడక పొతే పార్టీ తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది అని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది  అని తెలుస్తోంది. వీటిలో ఎఫెక్ట్ అయ్యే నియోజకవర్గాలని పరిశీలిస్తే ముందుగా ఏలూరు, చింతలపూడి, పాలకొల్లు, నరసాపురం,భీమవరం,తణుకు,ఉంగుటూరు వీటిలో మాత్రం పూర్తిగా మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది.ఇంకా మిగిలిన జిల్లాలలో కూడా మార్పులు భారీగానే ఉంటాయని టాక్.  ఒక వేళ సమీకరణాలు మారితే మరింత మందికి మొండిచేయే. ఇదే కనుక జరిగితే బాబు కి అసమ్మతి గళం ఎఫెక్ట్ గట్టిగానే తగులుతుంది.మరి  వీళ్ళందరికి చంద్రబాబు ఎలా సర్ది చెప్పుకుంటాడో చూడాలి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *