ఎమ్మెల్యే బ‌రిలో గంటా కొడుకు ర‌వితేజ‌..?

ఏపీలో ఒక మంత్రికి కొడుకు, మ‌రో మంత్రికి అల్లుడు అయిన గంటా ర‌వితేజ తాజాగా జ‌య‌దేవ్ సినిమాతో వెండితెరంగ్రేటం చేశాడు. జ‌యంత్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి డిజాస్ట‌ర్ అయ్యింది. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉన్న ర‌వితేజ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పొలిటిక‌ల్ అరంగ్రేటం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ టీడీపీ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. జ‌య‌దేవ్ రిలీజ్ సంద‌ర్భంగా ర‌వితేజ విశాఖ జిల్లా చోడవరంలో విఘ్నేశ్వరాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్లిన ర‌వితేజ అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని చెప్పిన ర‌వితేజ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? ఏ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తారు అన్న ప్ర‌శ్న‌కు షాకింగ్ ఇన్స‌ర్ ఇచ్చాడు.

చోడ‌వ‌రం అయితేనే ఇష్ట‌మ‌ని, తన తండ్రి ఇక్కడి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఈ ప్రాంతంతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. ర‌వితేజ చేసిన ప్రకటన ఆ నియోజకవర్గ రాజకీయాల్లో పెద్ద ప్రకంపనలకే దారితీసింది. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కెఎస్ ఎన్ రాజు వచ్చే ఎన్నికల్లో తానే ఇక్కడి నుండి పోటీ చేస్తానని మరో ప్రకటన చేయాల్సి వచ్చింది.

చోడ‌వ‌రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చేందుకు చంద్ర‌బాబు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌చ్చు. ఈ టైంలో ర‌వితేజ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి కూడా పోటీ చేసేందుకు వెనుకాడ‌డం లేద‌ని తెలుస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *