నవాజ్ షరీఫ్ కొంపముంచిన…”మైక్రోసాఫ్ట్ ఫాంట్”

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కు ఆ దేశ సుప్రీంకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది ఆయనను ప్రధాని పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పుని ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే ప్రధానితో పాటు ఆయన కుటుంభ సభ్యులు నిందితులుగా ఉన్న పనామా గేట్ కుంభకోణం కేసులో తుదితీర్పు ప్రకటించింది ఆ దేశ సుప్రీంకోర్టు.. ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జిట్‌ జూలై 10న సమర్పించిన నివేదిక ఆధారంగా సర్వోన్నత న్యాయస్థానం నవాజ్‌ షరీఫ్‌ను దోషిగా తేల్చింది. షరీఫ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిలు తక్షణమే ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశాలు ఇచ్చారు

“వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి చచ్చినట్టు” ఎన్నో కుంభకోణాలు చేసి లక్షల కోట్లు గడించిన నవాజ్ షరీఫ్ కేవలం ఒక  మైక్రోసాఫ్ట్  “ఫాంట్” పట్టించింది . విషయానికి వస్తే  కుంభకోణాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ తాను అక్రమ సంపాదన చేయలేదు అని నిరుపించుకోవడానికి సంభందిత పత్రాలని  తన కూతురు “మర్యం నవాజ్ షరీఫ్ ” ఈ కేసుని విచారణ చేపడుతున్న ఆరుగురు సభ్యుల సంయుక్త దర్యాప్తు బృందం జిట్‌ కు అందచేసింది .

అయితే వారు ఆ పత్రాల పరిశీలన కోసం ల్యాబ్ కి పంపి పరిశిలించగా అవి తప్పుడు పత్రాలు అని తేల్చారు ఎలా అంటే ఆ పత్రాలు మీద ఉన్న సంవత్సరం చుస్తే 2006 లో  రికార్డు అయినట్టు ఉన్నాయి మరియు ఆ పత్రాలు మైక్రోసాఫ్ట్ Calibri ఫాంట్ లో ఉన్నాయి  కానీ  మైక్రోసాఫ్ట్ Calibri  ఫాంట్ 31st జనవరి 2007 కి ముందు అందుబాటులో లేదు ఈ విషయాన్ని పరిశీలించిన ప్రత్యేక దర్యాప్తు బృందం జిట్‌ కోర్టుకు  నవాజ్ షరీఫ్ అక్రమాలకి పాల్పడ్డాడు అని నివేదికని సమర్పించింది. ఇప్పుడు ఈ న్యూస్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *