పవన్ కొత్త లుక్…సూపర్ అంటున్న నెటిజన్లు…!!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క రాజకీయాలు, మరోపక్క సినిమాలు రెండిటినీ పక్కాగా ప్లాన్ చేసుకుంటూ అటు ప్రజలకి, ఇటు అభిమానులకి ఇద్దరికీ న్యాయం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మూడు సినిమాలకి ఒకే చెప్పిన విషయం విధితమే, అందులో పింక్ రీమేక్ సినిమా లో లాయర్ గా నటిస్తున్న పవన్ కళ్యాణ్ తన గెటప్ ని పూర్తిగా మార్చేశాడు..

రాజకీయాల్లో ఉన్నంత వరకూ గుబురు గెడ్డంతో, ఒత్తయిన జుట్టుతో ఉండే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ రీమేక్ సినిమా కోసం గెడ్డం తీసేశాడు. జుత్తు అలాగే ఉంచుకున్నా , మీసం గుబురుగా, ఒత్తుగా ఉంచుకున్నాడు. గెడ్డం పూర్తిగా షేవ్ చేసిన పవన్ కళ్యాణ్ తాజాగా లుక్ ఇప్పుడు అందరిని షేక్ చేస్తోంది. కర్నూల్ జిల్లా పాణ్యం లో కార్యకర్తల సమావేశానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ తన న్యూ స్టైల్ తో అందరిని షాక్ కి గురిచేశాడు…

 

 

 

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.