హై అలెర్ట్…ఏపీ లోకి కరోనా వైరస్…???

చైనాని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఇప్పటి వరకూ 490 మందిని పొట్టన బెట్టుకుంది. ఈ వ్యాధి ప్రపంచ దేశాలకి విస్తరించడంతో అన్ని దేశాల ప్రజలు తీవ్ర ఆందోళనకి లోనవుతున్నారు. ఇప్పటికే భారత్ కరోనా విషయంలో ప్రజలని చైనత్య వంతులు చేసింది. అయినా భారత్ లో చాలా రాష్ట్రాలలో కరోనా ఎంట్రీ ఇచ్చేసింది..ఇదిలాఉంటే..కరోనా వైరస్ ఏపీలో కి కూడా ఎంట్రీ ఇచ్చిందనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.

Image result for corona virus

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో ఒకరు ఆసుపత్రిలో చేరారని, ఆ వ్యక్తికీ కరోనా సోకినట్లుగా ఆసుపత్రి అధికారులు ధృవీకరించారని  తెలుస్తోంది. అయితే అవనిగడ్డకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకిందని రెండు రోజుల క్రితం వచ్చిన వార్తలు నేపధ్యంలో ఇప్పుడు ఆసుపత్రిలో చేరిన వ్యక్తి, ఈ వ్యక్తి ఒకరేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఏపీ ప్రజలు కరోనా విషయంలో జాగ్రతలు వహించాలని సూచిస్తున్నారు అధికారులు..

 

Leave comment

Your email address will not be published. Required fields are marked with *.