జ‌న‌సేన‌లోకి బ‌ర్నింగ్‌స్టార్‌..? పోటీ ఎక్క‌డ‌..!

బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు నిన్న‌టి వ‌ర‌కు బిగ్ బాస్ హౌస్‌లో ర‌చ్చ ర‌చ్చ చేసి ఇప్పుడు అవుట్ అయ్యాడు. ఇక తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా సిద్ధిపేట‌కు చెందిన సంపూర్ణేష్‌బాబు హృద‌య‌కాలేయం సినిమాతో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్క సినిమాతోనే బ‌ర్నింగ్‌స్టార్ అయ్యాడు. ఆ త‌ర్వాత సంపూ సింగం 123 సినిమాతో మ‌రోసారి స‌త్తాచాటాడు.

ఇక తాజాగా సంపూ వైర‌స్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇదిలా ఉంటే సంపూ వ‌చ్చే ఎన్నిక‌ల వేళ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. సంపూకు స‌మ‌కాలీన అంశాల‌పై మంచి అవ‌గాహ‌న ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం విశాఖ‌లో జ‌రిగిన స‌భ‌కు సంపూ డేర్ చేసి వెళ్లిన తీరుతో ఆయ‌న అంద‌రి మ‌న‌స్సులు గెలుచుకున్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సంపూ జ‌న‌సేనలోకి ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల్లో నిజానిజాలు ఏంట‌న్న‌ది తెలియ‌క‌పోయినా సంపూ మాత్రం ప‌వ‌న్ ప‌ట్ల‌, ప‌వ‌న్ సామాజిక నిబ‌ద్ధ‌త ప‌ట్ల న‌మ్మ‌కంతో రాజ‌కీయంగా ఆ పార్టీతోనే ఎంట్రీ ఇవ్వాల‌ని చూస్తున్నాడ‌ట‌.

సిద్ధిపేట‌కు చెందిన సంపూ మ‌రి జ‌న‌సేన నుంచి సిద్ధిపేట‌లోనే పోటీ చేస్తాడా ? లేదా గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లోని ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తాడా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌కు సంపూ ఆన్స‌ర్ ఇస్తే కాని తెలియ‌దు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *