ఇప్పుడు జగను…!!..తరువాత పవనేనా..??

ఏపీ రాజకీయాల్లో జగన్ పై జరిగిన దాడి ఘటన పెను సంచలనమే అయ్యింది. ఒక ప్రతిపక్ష అధినేత కి కూడా రక్షణ కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉందా మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు టీడీపీ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తున్నారు. చంద్రబాబు స్పందించిన తీరు అస్సలు బాలేదని విమర్శించారు. ఒక పక్క దాడి ఘటనపై మీరు చేసిన కుట్ర అంటే కాదు కాదు మీరు చేసిన కుట్ర ఇది అంటూ ఒక పార్టీపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఎవరో చెప్పినట్టుగా చంద్రబాబు నడుచుకుంటుంటే ఎలా అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ  దుమ్మెత్తి పోశారు.

Image result for jagan attack kanna lakshmee narayana

సినిమా నటుడు చదివిన స్క్రిప్ట్ అంతా సీఎం చంద్రబాబు రాసిందేనని కన్నా ఆరోపించారు. అలిపిరిలో దాడి జరిగినప్పుడు చంద్రబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఎందుకు ఫిర్యాదు చేయలేదని కన్నా ఎద్దేవా చేశార… రాష్ట్రంలో అసమర్థ పాలన జరుగుతుంటే గవర్నర్ జోక్యం చేసుకోవడంలో తప్పేమీ లేదని తెలిపారు. అమిత్ షాపై దాడి చేశారు. అలాగే తనపై కూడా దాడి చేశారన్నారు. పవన్‌కల్యాణ్‌పై కూడా దాడికి కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. అయితే కన్నా పవన్ ప్రస్తావన ఎందుకు తెచ్చారు అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *