yasodha trailer release

“యశోద రివ్యూ”….ఆ 20 నిమిషాలే సినిమాకు ప్రాణం…!!

సమంత అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న “యశోద”  సినిమా తెలుగు, తమిళం ,కన్నడం, మలయాళం ,హిందీ భాషల్లో ఈనెల 11న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమాపై సమంత భారీగానే ఆశలు పెట్టుకుంది, అభిమానులు సైతం తమ అభిమాన నటి సినిమా బిగ్ సక్సెస్ అవ్వాలంటూ,  ఆమె ఆరోగ్యం బాగుండాలంటూ పూజలు కూడా చేశారు, సినిమా హాళ్లు ముందు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు అయితే ఈ సినిమా హిట్ అయ్యిందా, లేదా బాక్సాఫీస్ ముందు బోల్తా పడిందా అనేది ఇప్పుడు చూద్దాం.

Yashoda (2022) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

సమంత విడాకుల తరువాత చాలా కాలం గ్యాప్ లో నటించిన సినిమా కావడం ఒకటైతే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడం, సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మోయడం, పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించడం, ప్రమోషన్స్, వగైరా వగైరా సినిమా పై భారీ అంచనాలను పెంచాయి. కాగా

Samantha's Yashoda movie teaser review | cinejosh.com

యశోద సినిమా ప్రీమియర్స్ చూసినవారు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు సరికొత్త కాన్సెప్ట్ తో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉందంటూ అలాగే సరోగసి ఆసుపత్రిలో ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్తో యశోద సినిమా మలుపు తిరుగుతుందని ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే 20 నిమిషాల సన్నివేశాలు ఈ సినిమాకి ప్రాణం పోసేయని అంటున్నారు. ఈ సినిమాలో సమంత నటన గత సినిమాలకంటే కూడా ప్రత్యేకంగా ఉందని,  థ్రిల్లింగ్ సీన్స్ లో  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందంటున్నారు. ఏది ఏమైనా సినిమా పై ప్రిమియర్ షో కే మంచి టాక్ రావడం సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *