జగన్…”రీ-ఎంట్రీ” అదిరిపోనుందా..!!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని ఈరోజు ఆయన్నిపరిశీలించిన  వైద్యులు తెలిపారు. అయితే గాయం ఇంకా మానని కారణంగా జగన్ కి మరో మూడు వారాల రెస్ట్ తప్పనిసరి వైద్యులు సూచించారు. కానీ మళ్లీ ఎప్పుడు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లాలి అని పరితపిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ గాయం లెక్క గా కనిపించడం లేదు. అతి త్వరలోనే ప్రజల ముందుకు రావాలని పాదయాత్రను కొనసాగించాలని తన రాక కోసం ఎదురుచూస్తున్న ప్రజలను కలవాలని జగన్ నిశ్చయించుకున్నారు. అయితే భుజానికి ఎక్కువగా కదలిక లేకుండా కట్టు కట్టు కొని యాత్ర కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Image result for jagan hospital

ఇలా ఉంటే జగన్ గాయం కారణంగా ఇక యాత్ర కొనసాగింపు ఉండదని భావించిన టిడిపి నేతలకు జగన్ తాజా నిర్ణయం దిమ్మతిరిగేలా చేస్తోంది. విపరీతమైన గాయం అయినా సరే జగన్ యాత్రకు వెళ్లాలని చెప్పటం ఒకరకంగా టీడీపీ నేతలకు బిగ్ షాక్ అనే చెప్పాలి. గాయం తగిలిన రెండవ రోజున జగన్ వైద్యులతో యాత్రకు వెళ్తానని చెప్పడం వారిని విస్మయానికి గురిచేసింది.. అయితే పలుమార్లు జగన్ వైద్యులను పాదయాత్ర విషయంలో అడుగగా భుజానికి అలసట కలిగించకుండా ఎన్ని వేల కిలోమీటర్లు యాత్ర చేసుకోవచ్చని అయితే నడకలో తప్పకుండా భుజం కదులుతుంది కావున ఆ ఆలోచన కొన్ని రోజులు విరమించాలని కోరినట్లుగా తెలుస్తోంది.

Image result for jagan mohan reddy padayatra

అయితే జగన్ పాదయాత్ర ముందు ఆ గాయం పెద్దగా కనిపించలేదు దాంతో నవంబర్ మొదటి వారంలో జగన్ పాదయాత్రను మళ్లీ పునర్ ప్రారంభించాలని ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గత గురువారం ఆగిన జగన్ యాత్ర మళ్లీ విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం మక్కువ గ్రామం నుంచి కొనసాగించనున్నారు. ఈసారి జగన్ యాత్రకు మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు ప్రస్తుతం విజయనగరం శివారులో ఉన్న యాత్ర త్వరలోనే శ్రీకాకుళం జిల్లా లో అడుగుపెట్టనుంది.

Related image

జగన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ఈసారి జగన్ ప్రజాక్షేత్రంలో టిడిపిని ఉతికి ఆర డన్ ఖాయమని, ఇప్పటికే ఈ విషయంలో వైసీపీ శ్రేణులు పక్కా వ్యూహంతో ఉన్నారని అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. దాడి తర్వాత జగన్ చేపడుతున్న ఈ కొనసాగింపు యాత్రకి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో బ్రహ్మరథం పట్టడం ఖాయమని జగన్ కి మద్దతుగా వేలమంది సభలకు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వేస్తున్నారు వైసీపీ నేతలు. మరి వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి రీ ఎంట్రీ ఎలా ఉండబోతుందో త్వరలో తేలిపోనుంది అంటున్నారు వైసీపీ నేతలు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *