అమెరికాలో “బాలయ్య”..“జగన్” లకు ఓట్లు..!!!

అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీ చేసిన ట్రంప్, బిడెన్ ల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో బిడెన్ ట్రంప్ కంటే అత్యధిక ఓట్లతో విజయం సాధించారు. కేవలం ఈ ఇద్దరి మధ్య జరిగిన పోరులో తుది విజయం మాత్రం బిడెన్ ను వరించింది. త్వరలో బిడెన్ శ్వేత సౌధంలో కాలు మోపనున్నారు, ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించనున్నారు. ఇదిలాఉంటే..

US Election 2020 Results - BBC News

అమెరికా ఎన్నికల్లో బిడెన్, ట్రంప్ ఇరువురికి మాత్రమే కాదు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, టాలీవుడ్ టాప్ హీరో బాలయ్య బాబుకు కూడా ఓట్లు పడ్డాయి..అదేంటి జగన్ మోహన్ రెడ్డి , బాలయ్య బాబుకి ఓట్లు పడటం ఏమిటి అనుకుంటున్నారా అసలు విషయం ఏమిటంటే.

No photo description available.

మన దేశంలో ఎన్నికలు జరిగే సమయంలో ఓటర్లు బ్యాలెట్ పత్రాలపై తమ ఇష్టదైవం పేర్లు రాసుకునో లేదా బొమ్మలు వేసో ఓట్లు వేస్తారు. అలాగే అమెరికాలో ఓట్లు వేసిన తెలుగు వారిలో చాలామంది బ్యాలెట్ పత్రాలపై బాలయ్య, జగన్ అంటూ పేర్లు రాయడం వెలుగులోకి వచ్చింది. బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్న సమయంలో ఈ పేర్లు ఉన్న పత్రాలను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *