girls want won house boys for marriage

అమ్మాయిల కొత్త కండిషన్స్..అబ్బాయిల పెళ్ళిళ్ళు అయినట్టే..??

ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మరిచిపోలేని ముఖ్యమైన ఘట్టం. అందుకే పెళ్లి విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తూ ఉంటారు. తమకు నచ్చిన భాగస్వామిని ఎంచుకునే క్రమంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. గతంలో మంచి వ్యక్తి అయ్యిఉండాలి, ఎలాంటి అలవాట్లు ఉండకూడదు, మంచి ఉద్యోగం ఉండాలి, అనుకునే వాళ్ళు కాలక్రమంలో అలవాట్లు ఉన్న పర్లేదు మరీ ఎక్కువగా ఉండకూడదు, మంచి ఉద్యోగం మాత్రమే కాదు జీతం కూడా దండిగా ఉండాలని అనుకునే వారు. సాఫ్ట్ వేర్, ప్రభుత్వ ఉద్యోగుల వైపు ఎక్కువగా దృష్టి పెట్టేవారు. కానీ

Everything You Need to Know About Escaping from a Forced Marriage

కాలం మారింది. కరోనా వచ్చి కొట్టిన దెబ్బకు అటు అమ్మాయిలు, ఇటు అబ్బాయిలు ఎవరికీ వారు పెళ్లి విషయంలో అమాంతం తమ అభిప్రాయాలను మార్చుకోవడం మొదలు పెట్టారట. మంచి జీతం ఉండాలి, మంచివాడై ఉండాలనుకునే వాళ్ళు ఒక్క సారిగా కోవిడ్ ఎఫ్ఫెక్ట్ కారణంగా ఆ రెండు కోరికలతో పాటుగా సొంత ఇల్లు కూడా ఉండాలని కండిషన్లు పెడుతున్నారట. కరోన కారణంగా నగరాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ఉద్యోగులకి అద్దె ఇళ్ళ వాళ్ళు ఖాళీ చేయాలని హుకుం జారీ చేయడం, ఉద్యోగం ఉన్నా ఇల్లు దొరకక ఇబ్బందులు పడటం స్వయంగా చూసిన అమ్మాయిలు ఇప్పుడు జీతం తక్కువగా ఉన్నా సొంత ఇల్లు ఉండాల్సిందేనని మ్యారేజ్ బ్యూరో లకు కండిషన్లు మార్చమని చెప్తున్నారట. దాంతో

Haryana's crisis: Bridegrooms all decked up, but no one to marry - India  News , Firstpostmarriage bureau

పెళ్లి కాని ప్రసాదులు మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాయి మ్యారేజ్ బ్యూరోలు. పెళ్లి కొడుకు అందంగా లేకపోయినా పరవాలేదు, జీతం కాస్త తక్కువైనా పరవాలేదు కానీ సొంత ఇల్లు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారట.దాంతో ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. కరోనా ఎఫెక్ట్ ఇప్పుడు పెళ్లి కాని ప్రసాదులకు శాపంగా మారిందని అంటున్నారు నిపుణులు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *