కృష్ణా వాసి “రూ.8,804కోట్ల” భారీ విరాళం..ఎందుకో తెలుసా..!!

విరాళాలు అందించాలంటే వారి వారి స్థాయిని బట్టి విరాళాలు ఇస్తూ ఉంటారు. లక్షల కోట్లు ఉన్నాయి కదా అని కోట్లాది రూపాయలు విరాళాలుగా అందించాలనే రూల్ ఏమి లేదు. కానీ తమకి ఉన్న దానిలో నలుగురికి పంచాలి, సమాజానికి ఉపయోగ పడే ఎదో ఒక మంచి పని చేయాలని ఆలోచన చేసి భూరి విరాళాలు అందించే వాళ్ళు లేకపోలేదు. అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడిన ఏపీ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా వాసి లక్కి రెడ్డి హనిమి రెడ్డి కుటుంభం సొంత ప్రాంతానికే కాకుండా అమెరికాలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

Dr.Vikram-Priya Lakireddy Donates To UC Merced Central Hub

అమెరికాలోని మెర్సుద్ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు లక్కి రెడ్డి హనిమీ రెడ్డి తనయుడు డా. లక్కి రెడ్డి విక్రమ్, ప్రియా దంపతులు కళ్ళు చెదిరేలా దాదాపు రూ.8,804కోట్ల భూరి విరాళాన్ని యూనివర్సిటీ అభివృద్ధిలో భాగంగా అందజేశారు. యూనివర్సిటీ విస్తరణ పనులు, అలాగే సెంట్రల్ హబ్ నిర్మాణానికి ఈ మొత్తం అందజేసినట్టుగా యూనివర్సిటీ తెలిపింది. ఈమేరకు ఓ ప్రకటిన విడుదల చేసింది

How an infamous Berkeley human trafficking case fueled reform - San  Francisco Public Press

డా. లక్కిరెడ్డి కుటుంభానికి యూనివర్సిటీ ఎంతో ఋణపడి ఉంటుందని లక్కి రెడ్డి విక్రమ్ తండ్రి లక్కి రెడ్డి హనిమిరెడ్డి సైతం యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎన్నో సార్లు విరాళాలు అందించారని తెలిపింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *