బాబాయి సూచించాడు..అబ్బాయి పాటించాడు..!!

బాబాయి పిలుపుకి అబ్బాయి స్పందించాడు.. తితలీ తుఫాను భాదితులని పరామర్శించిన పవన్ వారిని ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ..భాదితులకి అండగా ఉంటానని ప్రకటించారు అంతేకాదు తన అన్నయ్య కొడుకు రామ్ చరణ్ తో మాట్లాడి ఒక గ్రామాన్ని దత్తత తీసుకోమని చెప్తానని పవన్ ప్రకటించారు..అయితే ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే రాంచరణ్ స్పందిచారు..

తితలీ తుఫాను  ప్రభావిత గ్రామాల్లో ఒక గ్రామాన్ని  దత్తత తీసుకోవాలని రామ్‌చరణ్ నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం పై  ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు..తను ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని చెర్రీ వెల్లడించారు. అయితే ఏ గ్రామాన్ని దత్తత తీసుకుంటారనే విషయం త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. గ్రామం దత్తత విషయంపై తన బృందానికి భాద్యతలు అప్పగించానని త్వరలోనే  ఏ గ్రామాన్ని దత్తత తీసుకోవాలన్నది తెలుపుతానని చరణ్ తెలిపారు

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *