కేసీఆర్ కి మరో సారి  “జై కొట్టిన ఏపీ ప్రజలు”..!!!

తెలంగాణా సీఎం కేసీఆర్ కి కేవలం తెలంగాణా రాష్ట్రంలో మాత్రమే కాదు, ఏపీలో కూడా అభిమానులు ఉన్నారు. విభజన సమయంలో కేసీఆర్ పై నిప్పులు చెరిగిన ఏపీ ప్రజలు తదనంతరం తమదైన ప్రేమాభిమానాలు చూపించారు. కొన్ని చోట్ల కేసీఆర్ కి పాలాభిషేకాలు జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంతేకాదు తిరుమల తిరుపతి దర్సనానికి కేసీఆర్ వచ్చిన సమయంలో తిరుపతి ప్రజలు సాదర స్వాగతం పలికారు..ఇదిలాఉంటే

Watch: Fans put up KCR flexies in AP

కేసీఆర్ పై ఏపీ ప్రజలు మరో మారు తమ అభిమానాన్ని చూపించారు. అందుకు కారణం లేకపోలేదు. నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలంలో కొలువై ఉన్న స్వర్ణ ముఖి పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేసీఆర్ దంపతులు విరాళం అందించారు. ఆలయ మహారాజ గోపురం, తూర్పు మాడ వీధి నిర్మాణానికి విరాళం అందించారు. కరోనా ప్రభావంతో రాలేక పోయానని, త్వరలో  ఆలయ దర్సనం చేసుకుంటానని తెలిపారట.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *