డ్రగ్స్ కేసులో ఎవ్వరినీ వదలకండి “కెసిఆర్”

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి  “కెసిఆర్”,ఎక్సైజ్‌ ఎన్ఫోర్స్మెంట్ అకున్ సభర్వాల్ తో మరియు డీజీపి అనురాగ్ శర్మ తో పాటు ఇతర ఉన్నత అధికారులతో డ్రగ్స్ కేసుల విషయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కెల్విన్ ని మరింతగా విచారించిన అధికారులు మరిన్ని కీలక విషయాలు రాబట్టారు అధికారులు ఇప్పటికే సినీ ఇండస్ట్రీ లో చాలా మంది తారాలకి నోటిసులు పంపిన విషయం మనకి తెలిసిందే.

ఐతే డ్రగ్స్ కేసులో రెండవ లిస్ట్ విడుదలకి  15 మందితో కూడిన  జాబితాను సిట్ అధికారులు సిద్ధం చేసినట్లుగా సమాచారం, వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్లు తెలియవచ్చింది. ఇది ఇలా  ఉన్న సమయంలో డిజిపి, అకున్ ,కెసిఆర్ ని కలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. సినిమా ఇండస్ట్రీ లో మరింతమంది పెద్దల పేర్లు, అగ్ర హీరో పేరు, మరికొంతమంది వర్గాల వారి పేర్లు ఉండటం వలన అకున్ సభర్వాల్  కెసిఆర్ ముందు పూర్తిస్థాయి నివేదిక ఉంచినట్టు సమాచారం.ఐతే ఇప్పటికే మీడియా లో గాని సోషల్ మీడియా లో కాని అకున్ సభర్వాల్ పై రాజకీయ వత్తిడి ఉంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో CM కెసిఆర్ అధికారులతో సమావేశం నిర్వహించారు, ఈ సమయంలో ఏ ఒక్కరిని వదిలినా ప్రభుత్వం పరువు మరియు తెరాస  పార్టీకి నష్టం కలుగుతుంది అని భావించిన కెసిఆర్ ఎవ్వరినీ వదిలే ప్రశక్తి లేదని అధికారులకి చెప్పినట్టు సమాచారం,ఈ డ్రగ్స్ కేసుల్లో ఎటువంటి పెద్దలు,సినిమా పెద్దలు ఉన్నా  రాజకీయ వత్తిడులకి తలొగ్గి ఉండద్దు అని “కెసిఆర్”  తేల్చి చెప్పేశారు. అవసరం ఐతే పోలిసుల సహకారం తీసుకుని సాధ్యమైనంత త్వరగా కేసుని పూర్తి చేయాలి అని అకున్ కి పూర్తి స్థాయిలో స్వేఛ్చ ఇచ్చారు.

 

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *