వైసీపీ ప్ర‌చారానికి ‘మ‌హేష్‌’..

తెలుగు రాజ‌కీయాల‌కు సినిమా రంగానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక సూప‌ర్‌స్టార్ కృష్ణ ఫ్యామిలీకి రాజ‌కీయాల‌కు కూడా ఎంతో రిలేష‌న్ ఉంది. కృష్ణ ఏలూరు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున ఎంపీగా ఎన్నిక‌య్యారు. ఎన్టీఆర్‌తో కృష్ణ ముందునుంచి విబేధించ‌డంతో కృష్ణ టీడీపీకి యాంటీగా కాంగ్రెస్ రాజ‌కీయాల్లోనే కొన‌సాగారు. ఇక దివంగ‌త సీఎం రాజశేఖ‌ర్‌రెడ్డితో కూడా కృష్ణ ఫ్యామిలీ ఎంతో స‌న్నిహితంగా ఉంది.
ఇక కృష్ణ వియ్య‌పురాలు గ‌ల్లా అరుణ కాంగ్రెస్‌లో మంత్రి కూడా ప‌నిచేశారు. ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలోకి జంప్ చేసిన గ‌ల్లా ఫ్యామిలీలో అరుణ చంద్ర‌గిరి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, ఆమె కుమారుడు, మ‌హేష్ బావ జ‌య‌దేవ్ గుంటూరు ఎంపీగా గెలిచారు. ఇక గ‌త ఎన్నిక‌ల అనంత‌రం కృష్ణ సోద‌రుడు ఆదిశేష‌గిరిరావు వైసీపీలో చేరిపోయారు.
ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోన్న టాక్ ఏంటంటే సూప‌ర్‌స్టార్ కృష్ణ వైకాపాలో చేరుతున్నార‌ట‌. కృష్ణ ఎలాగూ తొలి నుంచి టీడీపీకి యాంటీగానే ఉన్నారు. ఇప్పుడు ఆయ‌న్ను వైసీపీలో చేర్చుకోవాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ పెట్టినట్టు తెలుస్తోంది. జ‌గ‌న్‌ను సీఎం చేసేందుకు పీకే ఎన్ని ప్లాన్లు వేయాలో ? అన్ని వేస్తున్నాడు.
ఈ క్ర‌మంలోనే కృష్ణ‌ను టీడీపీలో చేర్చుకునే ప్లాన్‌ను సైతం పీకే చెప్పిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల ద్వారా మ్యాట‌ర్ లీక్ అయ్యింది. కృష్ణ‌ను వైసీపీలో చేర్చుకుని విజ‌య‌వాడ ఎంపీ సీటు ఇచ్చే అంశంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే మ‌హేష్‌బాబుతో వైసీపీకి ప్ర‌చారం చేయించుకోవ‌చ్చ‌న్న బిగ్ ప్లాన్‌కు జ‌గ‌న్ తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది. మరి జ‌గ‌న్ ఎత్తులు ఎంత వ‌ర‌కు పార‌తాయో ?  చూడాలి.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *