“కాపు” వర్గాలలో రేగిన కసి..ముద్రగడ ఏమి ప్లాన్ వేశావయ్యా..

ఎన్నికలు దగ్గర పడుతుండటం తో ఏపీలో కుల రాజకీయాలు సమీకరణాలు ఎక్కువయ్యాయి..ఎలక్షన్ బూత్ కి వెళ్ళే ముందు వరకూ కూడా  కులపెద్దలు కుల పాటాలని  మీటింగ్ లు పెట్టి మరీ నూరి పోస్తూ ఉంటారు. ప్రతీ ఎన్నికల ముందు జరిగే తంతు జరుగుతూనే  ఉంటుంది..ఈ క్రమంలోనే ముద్రగడ పద్మనాభం కాపులని సమాయుత్తం చేస్తున్నారు..టీడీపి కి ఒక్క కాపుల ఓటు పడకుండా చేయడమే ముద్రగడ టార్గెట్ అందుకు గాని ముద్రగడ చంద్రబాబు పై తీరిక దొరికినప్పుడల్లా ఫైర్ అవుతున్నారు..వివరాలలోకి వెళ్తే..
Image result for mudragada padmanabham

చంద్రబాబు మైండ్ వాడుకుని వదిలేసే టైపు అని..చంద్రబాబు తన నీడని కూడా నమ్మరని..వాడుకోవడం అంటే చంద్రబాబుకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదని ఈ విషయాలు అందరికీ తెలిసినవే అని చెప్పారు..ఎన్నికల  సమీపిస్తున్న సమయంలో బీజేపీతో భంధం తెంచుకుని ఇప్పుడు మూసలు కన్నీరు కారుస్తున్నారు అని ఆరోపించారు…2014 ఎన్నికల్లో గెలవడం కోసం కాపులపై వరాల వాన కురిపించారు. .ఇప్పుడు ఒక్కటి కూడా అమలు చేయలేదు సరికదా కాపులకి న్యాయం చేసింది నేనే అంటూ మళ్ళీ మన వర్గం ఒట్లకి వల వేస్తున్నాడు అని కాపులు ఎవరూ చంద్రబాబు మాటలు నమ్మవద్దని పలు ఆరోపణలు చేశారు ముద్రగడ..

 

Related image

కాపులకు తీరని  అన్యాయం చేసిన చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు కాపు ఉద్యమ నేత రెడీ అయ్యారని అంటున్నారు.. ఈ క్రమంలోనే తాజాగా ముద్రగడ తన కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యమంత్రికి సంబంధించిన సామాజికవర్గం ఎలాగైతే ఒకటిగా ఉంటూ.. అనాదిగా టీడీపీకి సపోర్ట్ గా నిలుస్తున్నారో.. ఎన్నికల సమయానికి టీడీపీకి గంపగుంతగా  ఓట్లు వేస్తున్నారో అలానే కాపు జాతి కూడా ఏకం  కావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. 
Image result for mudragada padmanabham
మన కాపు లోకానికి మాయమాటలు చెప్తూ  మోసం మీద మోసం.. దగా మీద దగా చేసి నాలుగేళ్ల పాటు చంద్రబాబు నాయుడు కాలక్షేపం చేశారని ముద్రగడఅ తీవ్ర ఆరోపణలు చేశారు.. బీజేపి తో చంద్రబాబు రాసుకు పూసుకుని తిరిగినంత కాలం కాపుల అభ్యున్నతి కాపులకి ఇచ్చిన హామీలు గుర్తుకు రాలేదు ఇప్పుడు బీజేపీతో సంబంధాలు చెడిపోయాల ఆ నెపం బిజెపి పై మోపెస్తున్నారు అంటూ విమర్శించారు..తమ మన కాపు జాతిని దగా చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అంటూ ముద్రగడ ఫైర్ అయ్యారు..కాపు జాతికి చెందిన ఎవరూ కూడా చంద్రబాబు కి ఓటు వెయ్యద్దు అంటూ మండిపడ్డారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *