ప‌వ‌న్‌కు చెక్ పెట్ట‌నున్న పీకే..

ప్ర‌శ్నిస్తాన‌ని ఆవేశంగా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు వెళ్లిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ స్వ‌రం బాబును క‌లిసిన వెంట‌నే మారిందా ? అంటే అవున‌నే ఆన్స‌ర్లే ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్ర‌శ్నిస్తాన‌ని సీరియ‌స్‌గా బాబు వ‌ద్ద‌కు వెళ్లిన ప‌వ‌న్ బాబును క‌లిసి మీడియా ముందుకు వ‌చ్చాక స్వ‌రంలో మార్పు వ‌చ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ప‌వ‌న్ ప్ర‌తి మాటా చంద్ర‌బాబును కాకా ప‌డుతున్న‌ట్టే ఉంది.
జ‌గ‌న్ పాద‌యాత్ర స్టార్ట్ చేస్తోన్న అక్టోబ‌ర్ నుంచే తాను బ‌స్సుయాత్ర‌కు రెడీ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. ఇక నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ‌ర‌కి మ‌ద్ద‌తు ఇవ్వాల‌న్న అంశంపై రెండు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని చెప్పినా ప‌వ‌న్ మ‌ద్ద‌తు టీడీపీకే ఉంటుంద‌న్న‌ది ఆల్‌మోస్ట్ క్లారిటీ వ‌చ్చేసింది.
ఇక 2019 ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ+జ‌న‌సేన అల‌యెన్స్ దాదాపు ఖాయ‌మైన‌ట్టే అన్న టాక్ కూడా వ‌చ్చేసింది. ప‌వ‌న్ బ‌స్సుయాత్ర చేసినా అందులో జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తాడే త‌ప్ప, బాబుపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌డ‌ని డిసైడైన‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఇదిలా ఉంటే ప‌వ‌న్ వ్యూహానికి ఇప్పుడు ప్ర‌శాంత్ కిశోర్ చెక్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది.
ప‌వ‌న్ టీడీపీతో కలిసి వెళ్లేందుకు దాదాపు డిసైడ్ అవ్వ‌డంతో జ‌గ‌న్‌ను బీజేపీకి ద‌గ్గ‌ర చేసేందుకు పీకే అదిరిపోయే వ్యూహ‌ర‌చ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే బీజేపీకి 8-10 ఎంపీ సీట్ల‌తో పాటు ఏకంగా 35 ఎమ్మెల్యే సీట్లు ఆఫ‌ర్ చేసి ఆ పార్టీని పూర్తిగా త‌మ వైపునకు తిప్పుకునే ప్ర‌య‌త్నాల్లో జ‌గ‌న్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా టీడీపీతో క‌లిసి వెళ్లాల‌ని ప‌వ‌న్ తీసుకున్న డెసిష‌న్‌కు పీకే వైసీపీని బీజేపీని క‌లిపి  సూప‌ర్ చెక్ పెట్టేందుకు రంగం సిద్ధ‌మైన‌ట్టే క‌న‌ప‌డుతోంది.
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *