సానుభూతి బ్రహ్మానందరెడ్డి ని గెలిపించింది..

నంద్యాల ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. ఇరు పార్టీ లు పోటా,పోటీగా ప్రచారం నిర్వహించాయి.ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ ఆధ్యాంతం యుద్దంలా సాగిన పార్టీల బల ప్రదర్సనకి ఈరోజు సమాధానం ఇచ్చారు నంద్యాల ప్రజలు. టీడీపీ అభ్యర్ధి భుమా బ్రహ్మానంద రెడ్డి 27,466 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్ధి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు.

కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో అధికార టీడీపీ విజయం సాధించింది. టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27,466 ఓట్ల మెజారిటీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డిపై విజయం సాధించారు. భూమా బ్రహ్మానందరెడ్డికి 97,076 ఓట్లు రాగా, శిల్పా మోహన్‌రెడ్డికి 69,610 ఓట్లు వచ్చాయి. ఇక పోటీలో నిలిచిన కాంగ్రెస్‌ పార్టీ మూడోస్థానారికి పరిమితమైంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గడ్డం అబ్దుల్‌ ఖాదర్‌కు అతి తక్కువగా 1260 ఓట్లు వచ్చాయి.

మొదటిరౌండ్‌ నుంచి ఆధిక్యం సాధిస్తూ వచ్చిన టీడీపి , రౌండ్‌రౌండ్‌కు వచ్చేసరికి  టీడీపీ ఆధిక్యం పెరుగుతూ పోయింది. అయితే, ఒక్క 16వ రౌండ్‌లో మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి ఆధిక్యం సాధించారు. నంద్యాల ఉప ఎన్నికలో ప్రజాతీర్పును స్వాగతిస్తానని శిల్పా మోహన్‌రెడ్డి మీడియాతో చెప్పారు. ఈ ఎన్నికలో టీడీపీ డబ్బుప్రవాహం, సానుభూతి ప్రభావం చూపించిందని ఆయన తెలిపారు. ఈ ఉపఎన్నిక లో టీడీపీ గెలుపు  కేవలం సానుభూతి పరంగా వచ్చేందే కానీ,వైసీపి అపజయం కాదు అని తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *